అసెంబ్లీ సాక్షిగా ‘చిల్లర’ వ్యవహారం
- బిల్లు ఆపేశారంటూ ఆర్‌అండ్‌బీ
- అధికారులపై స్పీకర్‌కు ఫిర్యాదు
- చెల్లించాల్సిన రూ. 80 వేల
- విషయంలో వివాదం
సాక్షి, హైదరాబాద్: అస్మదీయులైతే నిబంధనలు పక్కకు పెడతారు.. కోరినన్ని పనులు దక్కేలా చూస్తారు. తమవారు కాకపోతే కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు సాగవు.. రోడ్డు భవనాల శాఖ లో ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలు. తాజాగా ఆ శాఖ అధికారుల తీరుపై ఓ కాంట్రాక్టర్ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశాడు. అధికారులు అడిగిన కమీషన్ గడువుకు ముందు ఇవ్వలేదని తనకు చెల్లించాల్సిన బిల్లు ఆపేశారని ఆరోపించాడు. ఆ అధికారికి రావాల్సి న బిల్లు విలువ రూ. 80వేలు మాత్రమే.. చివరకు రోడ్లు భవనాల శాఖ దగ్గరకు ఈ పంచాయితీ చేరింది.
ఇదీ సంగతి...: శాసన సభ, మండలి భవనాల్లో ఫర్నీచర్, కుళాయి, నీటిపైపులకు రోజువారీ ఫిర్యాదుల ప్రకారం మరమ్మతులు చేసేందుకు ప్లంబర్, కార్పెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో జరుగుతుంది. దీని టెండర్లను ఈ ఏడాది జనవరిలో పిలిచారు. 6నెలలకు రూ. 2.48 లక్షల కాంట్రాక్ట్‌ను పర్‌ఫెక్ట్ సర్వీసెస్ అనే సంస్థకు 5.2 శాతం తక్కువగా కట్టబెట్టారు.
ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో మూడు నెలలకు సంబంధించి రూ. 80వేలను చెల్లించాలని అధికారులను కాంట్రాక్టు సంస్థ కోరింది. ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందిచలేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ, మండలి భవనాల పనులకు బిల్లులు చెల్లించేందుకు సిద్ధం చేసిన జా బితాలో పర్‌ఫెక్ట్ సర్వీసెస్ సంస్థ పనుల మొత్తాన్ని చేర్చకపోవడంతో ఈ వివాదం వచ్చింది.