
వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ
సూర్యాపేట క్రైం : సూర్యాపేట జిల్లాకేంద్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య నెలకొన్న ఘర్షణ కాస్త.. శుక్రవారం చిలికి చిలికి గాలివానలా మారింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ బీజేపీ, టీఆర్‌ఎస్ ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు నాలుగు రోజుల క్రితం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
వివరాలు.. సూర్యాపేట పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన జోగు సాయి అనే యువకుడు జై సంకినేని అంటూ నాలుగు రోజుల క్రితం ఫేస్‌బు క్‌లో పోస్ట్ అప్‌లోడ్ చేశారు. అదేకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు అన్నపూర్ణ నరేందర్‌గౌడ్, నరేష్‌లు జై సంకినేని పోస్టులు ఆపాలంటూ మందలించారు.
దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొని విషయం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. అంతటితో ఆగకుండా తిరిగి శుక్రవారం రాత్రి సమయంలో సాయి కాలనీలో సంచరిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు బైక్‌పై వచ్చి తీసుకెళ్లారు.
కుడకుడ సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లి నరేందర్‌గౌడ్, నరేష్‌లతో పాటు మరో ఇద్దరు కలిసి సాయిపై బ్లేడ్‌తో దాడిచేసినట్లు తెలిపారు. దాడికి గురైన సాయి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగా.. అక్కడ పోలీసులు ఆయన ఫిర్యాదును ఎవరూ స్వీకరించలేదన్నారు.
ఆస్పత్రి ఎదుట ఆందోళన,లాఠీచార్జ్ చేసిన పోలీసులు
ఆస్పత్రి ఎదుట సాయిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు బ్లేడ్‌తో దాడి చేశారని తెలియగా.. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, బంధువులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐలు శివశంకర్, ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ జానికిరాములుతో పాటు సిబ్బంది చేరుకొని అడ్డువచ్చిన వారిపై లాఠీచార్జ్ చేశారు.
సీఐని సస్పెండ్ చేయాలి : సంకినేని
సూర్యాపేట అర్బన్ : ఫేస్‌బుక్‌లో బీజేపీ నాయకులపై దుర్భాషలాడుతున్నారని మూడు రోజుల కింద ఫిర్యాదు చేసినా పట్టణ సీఐ పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిని గాయపరిస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టణ సీఐ పట్టించుకోలేదన్నారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment