
సూర్యాపేట అర్బన్: నిరంతర విద్యుత్ సరఫరాతో రైతులకు తీవ్ర నష్టమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ఆందోళనవ్యక్తం చేశారు. సోమవారం సూర్యాపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు సాగుచేస్తున్న పంటలకు 24 గంటల కరెంటు నిర్ణయం తప్పని జిల్లాలోని రైతులు అభిప్రాయపడుతున్నారని, జిల్లాలో ఏ గ్రామ రైతైనా ఈ నిర్ణయం సరైందే అని నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని సవాల్ చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి గెలుపునకు కూడా ప్రచారం చేస్తానని అన్నారు.
ఇప్పటికే భూగర్బ జలాలు అడుగంటాయని, బోర్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలకు ఉచిత కరెంటు అని ప్రకటించడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణ, జీడిభిక్షం, రుక్మారావు, అయోధ్య, హబీద్, సలిగంటి వీరేంద్ర, సైలేంద్రాచారి, వల్దాసు ఉపేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment