Sankineni Venkateshwara Rao
-
మీ ఇంట్లో బిడ్డలా ఉంటా..
సాక్షి, సూర్యాపేట అర్బన్ : మీ ఇంట్లో బిడ్డగా ఉంటూ సేవ చేస్తానని.. తనను సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపించాలని బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్రావు కోరారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు సంకినేని నామినేషన్ పత్రాలతో సూర్యాపేటలోని శ్రీవేంకటేశ్వర, సాయిబాబా దేవాలయాల్లో పూజలు చేశారు. ఉదయం పది గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేట నియోజక వర్గ ప్రజలు ఒకసారి అవకాశం కల్పిస్తే పేటను అభివృద్ధిపథంలో నడిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి, నాయకులు రుక్మారావు, జుట్టుకొండ సత్యనారాయణ, నల్లగుంట్ల అయోధ్య, కట్కూరి గన్నారెడ్డి, కొణతం అప్పిరెడ్డి, హబిద్, తుక్కాని మన్మధరెడ్డి, జటంగి వెకంటేశ్యర్లు, శ్రీరాములు, సంపత్‌కుమార్,బూర మల్సూర్‌గౌడ్, వల్దాసు ఉపేందర్, రాజేష్‌నాయక్, మమతారెడ్డి, రంగినేని ఉమ, నాగమణి, శారద, పోలోజు మౌనిక, మీర్ అక్బర్, రమేష్ పాల్గొన్నారు. బీజేపీలో చేరికలు : టీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చేరినవారిలో మిడ్తనపల్లి మాజీ సర్పంచ్ ఎం.గంగయ్య, కందగట్ల నుంచి మద్ది నర్సింహారెడ్డి, బొద్డు మల్సూర్, పాతకోట్ల రమేష్, రవీందర్, వెంకన్న ఉన్నారు. ఈ కార్యక్రమంలో సంకినేని వరుణ్, జాటోతు రాజేష్‌నాయక్, అస్లం, తప్పెట్ల శ్రీరాములు, ఏడుకొండలు ఉన్నారు. సూర్యాపేటరూరల్ : మండలంలోని కుసుమవారిగూడెంలో టీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు సోమవారం రాత్రి సంకినేని సమక్షంలో బీజేపీలో చేరారు. చేరిన వారిలో వెన్న శ్యాంసుందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, గోగుల నర్సయ్య, సైదులు, రాంబాబు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్,జుట్టుకొండ సత్యనారాయణ, కట్కూరి గన్నారెడ్డి, వెన్న చంద్రారెడ్డి, నల్లకుంట్ల అయోధ్య, శైలేంద్రాచారి, సైదులు, రామకృష్ణ, నరేష్‌గౌడ్, వెన్న శశిధర్‌రెడ్డి, అబీద్, శ్రీనివాస్‌రెడ్డి, శివ పాల్గొన్నారు. -
నిరంతర కరెంట్‌తో రైతులకు నష్టం : సంకినేని
సూర్యాపేట అర్బన్: నిరంతర విద్యుత్ సరఫరాతో రైతులకు తీవ్ర నష్టమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు ఆందోళనవ్యక్తం చేశారు. సోమవారం సూర్యాపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు సాగుచేస్తున్న పంటలకు 24 గంటల కరెంటు నిర్ణయం తప్పని జిల్లాలోని రైతులు అభిప్రాయపడుతున్నారని, జిల్లాలో ఏ గ్రామ రైతైనా ఈ నిర్ణయం సరైందే అని నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని సవాల్ చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి గెలుపునకు కూడా ప్రచారం చేస్తానని అన్నారు. ఇప్పటికే భూగర్బ జలాలు అడుగంటాయని, బోర్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలకు ఉచిత కరెంటు అని ప్రకటించడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణ, జీడిభిక్షం, రుక్మారావు, అయోధ్య, హబీద్, సలిగంటి వీరేంద్ర, సైలేంద్రాచారి, వల్దాసు ఉపేందర్ పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డిను ఫుట్‌బాల్ ఆడుకుంటారు...
సాక్షి, హైదరాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చాలామంది నేతలు భారతీయ జనతా పార్టీకి వస్తారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 2019లో బీజేపీ గెలుపును ఏ రాజకీయ శక్తీ అడ్డుకోలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటారని సంకినేని వ్యాఖ్యానించారు. కాగా టీడీపీకి గుడ్‌బై చెప్పి ఇటీవలే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన రాకపట్ల ఆ పార్టీలో పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. -
‘టీఆర్ఎస్.. మాటల ప్రభుత్వమే’
సూర్యాపేట : టీఆర్ఎస్ కేవలం మాటల ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు అభివర్ణించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంకినేని మాట్లాడారు. రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డీఈఓగా గతంలో పని చేసి ఏసీబీకి చిక్కిన జగదీష్‌ను విద్యాశాఖ మంత్రి ముడుపులు తీసుకొని విధుల్లోకి తీసుకున్నారని ఆరోపించా రు. 174 ఇంజినీరింగ్ కళాశాలలు అనర్హతకు గురైనప్పటికీ వాటిని మళ్లీ పునరుద్ధరించే విషయంలో చేతులుమారాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఘర్షణలో గాయపడ్డవారిని పక్కనపెట్టి ఆర్డీఆర్ ప్రధాన అనుచరులను తమ పార్టీలో చేర్చుకొని అందళమెక్కిస్తున్నారని విమర్శించారు. ఇంత అవినీతి జరుగుతున్నా సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. గాంధీనగర్‌లో జరిగిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తాను ఢిల్లీకి వెళ్లి రాజ్‌నాథ్‌సింగ్‌కు విషయాన్ని వివరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గోదల రంగారెడ్డి, నల్లగుంట్ల అయోధ్య, వర్ధెల్లి శ్రీహరి, కొండేటి ఏడుకొండలు, రంగరాజు రుక్మారావు, చల్లమళ్ల నర్సింహ, జటంగి వెంకటేశ్వర్లు, జీడి భిక్షం, బండపల్లి పాండురంగాచారి, కలంచర్ల సౌడయ్యయాదవ్, రామగిరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.