రేవంత్‌ రెడ్డిను ఫుట్‌బాల్‌ ఆడుకుంటారు... | sankineni venkateswara rao comments on revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రెడ్డిను ఫుట్‌బాల్‌ ఆడుకుంటారు...

Published Thu, Nov 16 2017 1:20 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

sankineni venkateswara rao comments on revanth reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చాలామంది నేతలు భారతీయ జనతా పార్టీకి వస్తారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు.  దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 2019లో బీజేపీ గెలుపును ఏ రాజకీయ శక్తీ అడ్డుకోలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డిని ఫుట్‌బాల్‌ ఆడుకుంటారని సంకినేని వ్యాఖ్యానించారు. కాగా టీడీపీకి గుడ్‌బై చెప్పి ఇటీవలే రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఆయన రాకపట్ల ఆ పార్టీలో పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement