సూర్యాపేట : టీఆర్‌ఎస్ కేవలం మాటల ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అభివర్ణించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంకినేని మాట్లాడారు. రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డీఈఓగా గతంలో పని చేసి ఏసీబీకి చిక్కిన జగదీష్‌ను విద్యాశాఖ మంత్రి ముడుపులు తీసుకొని విధుల్లోకి తీసుకున్నారని ఆరోపించా రు.
174 ఇంజినీరింగ్ కళాశాలలు అనర్హతకు గురైనప్పటికీ వాటిని మళ్లీ పునరుద్ధరించే విషయంలో చేతులుమారాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఘర్షణలో గాయపడ్డవారిని పక్కనపెట్టి ఆర్డీఆర్ ప్రధాన అనుచరులను తమ పార్టీలో చేర్చుకొని అందళమెక్కిస్తున్నారని విమర్శించారు. ఇంత అవినీతి జరుగుతున్నా సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం బాధాకరమన్నారు.
గాంధీనగర్‌లో జరిగిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తాను ఢిల్లీకి వెళ్లి రాజ్‌నాథ్‌సింగ్‌కు విషయాన్ని వివరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గోదల రంగారెడ్డి, నల్లగుంట్ల అయోధ్య, వర్ధెల్లి శ్రీహరి, కొండేటి ఏడుకొండలు, రంగరాజు రుక్మారావు, చల్లమళ్ల నర్సింహ, జటంగి వెంకటేశ్వర్లు, జీడి భిక్షం, బండపల్లి పాండురంగాచారి, కలంచర్ల సౌడయ్యయాదవ్, రామగిరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
‘టీఆర్‌ఎస్.. మాటల ప్రభుత్వమే’
Published Sat, Nov 8 2014 4:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement