చక్కెర పరిశ్రమ విభాగంలో రూ.20 లక్షలపై రచ్చ
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.20 లక్షల నిధుల వ్యవహారం చక్కెర పరిశ్రమల విభాగంలో వివాదాలకు దారి తీస్తోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లా హిందూపూర్‌లోని నిజాం షుగర్స్‌ను ప్రైవేటు పరం చేశారు. ఈ సందర్భంగా జరిగిన లావాదేవీల్లో బకాయి రూపంలో సీడీసీకి (చెరుకు పరిశ్రమాభివృద్ధి సంస్థ) రావాల్సిన రూ.20 లక్షలను సదరు ప్రైవేటు సంస్థ చెల్లించింది.
చాలాకాలంగా చిత్తూరు చెరుకు సహాయ కమిషనర్ ఖాతాలో వున్న ఈ సొమ్మును రాష్ట్ర పునర్విభజన సమయంలో చక్కెర పరిశ్రమల విభాగం కమిషనరేట్ ఖాతాలో జమ చేశారు. ఈ నిధుల్లో నుంచి ఓ అధికారి వాహనం కొనుగోలుకు ప్రతిపాదిం చారు. చక్కెర పరిశ్రమల విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉన్నతాధికారి ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం.
ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తుల అమ్మకానికి సంబంధించిన నిధులు కాబట్టి, ఏపీకి చెందుతాయంటూ ఆ ఉన్నతాధికారి నివేదిక సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిజాం షుగర్స్‌కు అప్పులు, ఆస్తులు తెలంగాణకే చెందుతున్నందున రూ.20 లక్షలపై ఎలాం టి వివాదం లేదని మరో అధికారి వాదిస్తున్నారు.
ఎన్‌ఎస్‌ఎల్ నిధులు వివాదాస్పదం
Published Tue, Jun 23 2015 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM
Advertisement
Advertisement