
సాక్షి, వేలూరు(తిరువణ్ణామలై): కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. కణ్ణమంగళం సమీపంలోని అయ్యంపాళ్యంకు చెందిన అరుల్‌దాస్ పుష్పలత(27) దంపతులకు కుమారుడు సర్వేష్(2), కుమార్తె సంజన(1) ఉన్నారు. రెండు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన పుష్పలత సోమవారం రాత్రి 12 గంటలకు ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి సమీపంలోని బావిలో ఇద్దరు పిల్లలను తోసి ఆమె కూడా బావిలో దూకింది.
దీంతో సర్వేష్. సంజన మృతి చెందారు. పుష్పలత బావిలో ఉన్న మోటరు పైపును పటుకుని కేకలు వేసింది. స్థానికులు బావి వద్దకు చేరుకొని పుష్పలతను బయటకు తీశారు. చిన్నారుల మృత దేహాలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న కణ్ణమంగళం పోలీసులు చిన్నారుల మృత దేహాలను ఆçస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే కారణమని తెలిసింది. ఇద్దరు చిన్నారుల మృతదేహాల వద్ద బంధువులు గుండెలవిసేలా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment