
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలోని అదానీకి చెందిన కార్మైకేల్ బొగ్గు గనితో అమెరికన్ బ్యాంక్– బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లన్ కార్పొరేషన్ తన సంబంధాలను తెంచుకుంది. దీనితో అదానీ గ్రూప్‌నకు అలాగే ఆ సంస్థకు ఆస్ట్రేలియాలో ఉన్న బొగ్గు గనికి అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లభించదు.
పర్యావరణ, సామాజిక, పాలన నియమాలకు అదానీ ఆస్ట్రేలియా వెంచర్ విరుద్ధంగా ఉండడమే తన నిర్ణయానికి కారణమని పేర్కొంది. స్థానిక ప్రజల ఆందోళనల నేపథ్యంలో తాజా నిర్ణయం జరిగింది.