బ్యాలెట్‌ పేపర్లే ముద్దు: ట్రంప్‌ | Donald Trump bats for ballot papers as backup system | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ పేపర్లే ముద్దు: ట్రంప్‌

Published Thu, Mar 8 2018 3:10 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Donald Trump bats for ballot papers as backup system - Sakshi

వాషింగ్టన్‌: ఎన్నికల్లో వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే బ్యాలెట్‌ విధానమే సరైందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యం ఉందన్న ఆరోపణలకు బ్యాలెట్‌ పేపర్లే సమాధానం చెబుతాయని వ్యాఖ్యానించారు. ఇది పాత విధానమే అయినప్పటికీ పెద్దపెద్ద కంప్యూటర్లతో పరిష్కారం కాని సమస్య, కేవలం బ్యాలెట్‌ పేపర్లను వాడితే తీరుతుందన్నారు.ఈ విధానం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉందనీ, అధ్యక్ష ఎన్నికల్లోనూ తీసుకువచ్చేందుకు హోంలాండ్‌ సెక్యూరిటీ తదితర భద్రతా సంస్థలు తీవ్రంగా ఆలోచన చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పద్ధతి అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement