ballet papers
-
భారత్‌లోనూ EVMలు కాకుండా బ్యాలెట్‌నే వాడాలి: వైఎస్ జగన్
-
పోలింగ్‌లో గందరగోళం.. పలుచోట్ల బ్యాలెట్ పేపర్లు మాయం!
పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభించే ముందు బ్యాలెట్ పేపర్లు కలిగిన బ్యాగులను అధికారులు తెరవగా.. వాటిలో భారీ సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయి. దీంతో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు ఎన్నికల కేంద్రాల వద్ద ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ పత్రాలు ఉన్న బ్యాగులను తెరిచి చూడగా వాటిలో కొన్ని చిరిగిపోయి ఉండగా, మరికొన్ని బ్యాలెట్ పత్రాలు కనిపించకుండా పోయాయి. కరాచీ ఎన్నికల అధికారి దీనిపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ చేసేందుకే ఈ బ్యాలెట్ పత్రాలను ఎవరో మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ ప్రారంభించేముందు పాక్ ఎన్నికల సంఘం ఈ బ్యాలెట్ పత్రాలను వివిధ ఎన్నికల కేంద్రాలకు పంపింది. వాటిని పంపే సమయంలో బ్యాలెట్ పేపర్లు చినిగిపోయిన విషయాన్ని పాక్ఎన్నికల సంఘం గమనించలేదా? లేక దారిలో ఎవరైనా ఇలా చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కాగా ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్తాన్లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల దాడులను అరికట్టేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. -
ఈవీఎంలా.. బ్యాలెటా?
సాక్షి, హైదరాబాద్: నాలుగైదు నెలల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోవిడ్ నేపథ్యంలో ఈవీఎంలను వినియోగించాలా? బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు. దీంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆన్‌లైన్‌ను ఎక్కువగా వినియోగించుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంచి, పోలింగ్ శాతం పెరిగేందుకు కృషి చేయాలని భావిస్తున్నారు. నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, కోవిడ్ నేపథ్యంలో దురయ్యే సవాళ్లు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించాల్సిన వివిధ పనుల గురించి జోనల్ నుంచి సర్కిల్ స్థాయి అధికారులకు శిక్షణ నిచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌పై ఎన్నికల విధుల్లోని వారు తగిన అవగాహన కలిగి ఉండాలని, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ సిబ్బ ంది ర్యాండమైజేషన్ తదితర అంశాలు తెలిసి ఉండాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేందుకు, పోలింగ్ ప్రక్రియ త్వరితంగా జరిగేందుకు టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు సీజీజీ సహకారంతో ఫేస్ రికగ్నిషన్, తదితరమైనవి వినియోగించుకోవాలన్నారు.గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని, ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇంటెన్సివ్ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. ఇందుకు ఎన్జీఓలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఇతర పౌరసేవల సహకారం తీసుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా ఎన్నికల సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఈవీఎంలా.. లేక బ్యాలెట్లా అన్నదానిపై చాలాసేపు చర్చించారు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణ, కార్యాచరణకు సంబంధించి అక్టోబర్ రెండో వారంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో అడిషనల్ సీఈఓ జ్యోతి బుద్ధప్రకాశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తొలిసారి పంచాయతీ బరిలో నోటా
సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కులాల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేశారు. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించి తప్పొప్పులు సరిచేశారు. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలను పూర్తిచేసి అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకుని ఓటర్ల తుది జాబితాలను ప్రచురించారు. ఈసారి తొలిసారిగా స్థానిక ఎన్నికల్లో ‘నోటా’ విధానం ప్రవేశపెడుతుండటం మరింత ఆసక్తిని రేపుతోంది. నోటాకు అధిక ఓట్లు పోలయితే రీపోలింగ్ పెట్టాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో 909 గ్రామ పంచాయతీలుండగా 9,930 వార్డుల్లో 25,50,916 మంది ఓటర్లున్నారు. రెండు బ్యాలెట్లతో నిర్వహణ పంచాయతీ ఎన్నికలు రెండు బ్యాలెట్లతో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. పాత పద్ధతిలోనే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పత్రాలు కొనుగోలు చేయాలని, ముద్రణకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో రెండు రంగుల బ్యాలెట్లు ఉంటాయి. సర్పంచ్‌కు గులాబీ రంగు బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుగు రంగు బ్యాలెట్ పత్రాలను కేటాయించారు. జిల్లా స్థాయి కమిటీ అనుమతితో ఎంపిక చేసిన కేంద్రంలో వచ్చేనెల బ్యాలెట్ ముద్రణ జరుగుతుంది. అభ్యర్థుల ఖర్చు పెంపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల దరావతు, ఎన్నికల వ్యయ పరిమితి పెరగనుంది. దరావతు 150 శాతం నుంచి 1000 శాతం పెంచేలా ప్రతిపాదనలు చేశారు. 10 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలో సర్పంచ్‌కు రూ.20 వేలు, వార్డు సభ్యుడికి రూ.3 వేలు ఖర్చు చేయాల్సి వుండగా ప్రస్తుత సర్పంచ్ రూ.32 వేలు, వార్డుసభ్యుడు 4,800 వరకు ఖర్చు చేయవచ్చు. 10 వేల పైబడి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ రూ.40 వేలు, వార్డు సభ్యుడు రూ.5 వేలుగా ఉన్న ఎన్నికల వ్యయాన్ని ఇకపై సర్పంచ్‌కు రూ.64 వేలు, వార్డు సభ్యుడు రూ.8 వేలకు పెంచాలన్న ప్రతిపాదన ఉంది. రిజర్వేషన్లపై తర్జనభర్జన 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 39.99 శాతం, ఎస్సీలకు 18.30 శాతం, ఎస్టీలకు 8.50 శాతం కోటాను అమలు చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి నూతన ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి వుంది. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల్లో 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. దీంతో పల్లెల్లో పార్టీ మరింత బలంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు పలికిన సర్పంచులు గెలవడంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ సారి క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కులాల వారీగా ఆర్థిక స్థోమతను బట్టి ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అభ్యంతరాలు పరిష్కరించాం జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వనరులు, వసతులు పరిశీలించి ఎంపిక పూర్తి చేశాం. పంచాయతీ కార్యాలయాల్లో తుది ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రకటించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల కులగణ అంతా పారదర్శకంగా చేశాం. ఆయా వర్గాలకు ఉన్న ఓట్ల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండడంతో చాలా జాగ్రత్తగా పూర్తిచేశాం. ప్రభుత్వం రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఎన్నికలు పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. – రోళ్లకంటి విక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఏలూరు -
బ్యాలెట్ పేపర్ రె‘ఢీ’
సాక్షి,ఆరసవల్లి: స్థానిక సమరానికి ముహూర్తం సమీపిస్తోంది. పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు నడుం కట్టిన రాష్ట్ర ఎన్ని కల కమిషన్ సన్నాహాలకు అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు విధుల్లో స్పీడ్ పెంచా రు. ఈ క్రమంలో కీలకమైన బ్యాలెట్ ముద్రణకు సన్నాహాలు మొదలుపెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా ఇప్పటికే గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కులాలవారీగా ఓటర్ల తుది జాబితాను ఈనెల 18న, అలాగే పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈనెల 20న అధి కారికంగా ప్రకటించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు సన్నద్ధమవుతుండగా, మరోవైపు బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అధి కారులు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ క్షణంలో గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకు ఎన్నికల సంఘం జోరు పెంచింది. తాజాగా జిల్లాలోని గ్రామ సర్పంచులకు, వార్డు మెంబర్లకు వేర్వేరుగా బ్యాలెట్ పేపర్ల ముద్రణకు మొత్తం 26 మెట్రిక్ టన్నుల పేపర్‌ను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కేంద్రానికి సరఫరా చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోలు కమిటీ టెండర్లను పిలిచి.. ధరలను ఖరారు చేయనుంది. ఆ వెంటనే బ్యాలె ట్ పేపర్ ముద్రణ ప్రారంభించనున్నారు. స్థానిక ఎన్నికల్లో తొలిసారి.. నోటా! త్వరలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా బ్యాలెట్ పేపర్లో ‘నోటా’ గుర్తు కూడా ఉండేలా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతవరకు సార్వత్రిక ఎన్నికల్లోనే కనిపించిన ఈ నోటా చిహ్నం ఇప్పుడు పంచాయతీలకు చేరింది. రాజకీయ పార్టీల గుర్తులకు సంబంధం లేకుండా జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గుర్తులతో వివిధ రకాల బ్యాలెట్ పేపర్లు ముద్రించనున్నారు. ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే అక్కడికి సరఫరా చేసేందుకు వీలుగా రెండు గుర్తులు, ఒక నోటా గుర్తు ఉండేలా బ్యాలెట్ పేపర్ ముద్రించనున్నారు. ఏ గ్రామ పంచాయతీలో ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉంటారనే సంఖ్య తేలిన అనంతరం దాని ఆధారంగా ఆయా ప్రాంతాలకు బ్యాలెట్ పేపర్లను పంపించనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈ బ్యాలెట్ పేపర్లు ఉపయోగకరంగా ఉంటాయి. సర్పంచులకు పింక్, వార్డు మెంబర్లకు వైట్.. బ్యాలెట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సర్పంచ్ ఎన్నికకు 13 మెట్రిక్ టన్నుల పింక్ (గులాబీ) కలర్ బ్యాలెట్ పేపర్లు, వార్డు సభ్యుల కోసం 13 మెట్రిక్ టన్నుల వైట్ (తెలుపు) బ్యాలెట్ పేపర్లు వేర్వేరుగా జిల్లాకు కేటాయించారని జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు టెండర్ల ప్రక్రియ జరిగిన తర్వాత ప్రింటింగ్ ప్రారంభమవుతుందన్నారు. అలాగే ఈ ప్రక్రియను జూలై మొదటి వారంలో పూర్తి చేయాలని ఆదేశాలు అందాయని, 18న కులాల వారీగా ఓటర్ల జాబితా, 20న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. -
లక్షలాది చెట్లను బ్యాలెట్ బాక్స్‌ల్లో వేసేశాం!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ఒకప్పుడు ఎన్నికల నిర్వహణ అంతా బ్యాలెట్ పత్రాలపైనే జరిగేది. 1999 ముందు వరకు ఈ విధానమే నడిచింది. ఎన్నికలకు మూడు నెలలకు ముందే ప్రధాన పార్టీలకు చెందిన బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేది. దేశవ్యాప్తంగా ఒకసారి జరిగే ఎన్నికలకు 7,700 టన్నుల బ్యాలెట్ పత్రాలను వినియోగించేవారు. టన్ను పేపరును ఉత్పత్తి చేయడానికి సుమారు 140 చెట్లను కోల్పోవాల్సి వచ్చేది. ఈ లెక్కన ఒక్కో ఎన్నికకు ఎన్ని లక్షల చెట్లను మనం బ్యాలెట్ బాక్సుల్లో వేశామో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చులో కూడా ఉద్యోగుల నిర్వహణ తర్వాత ఎన్నికల సంఘం ఎక్కువగా వెచ్చించేది బ్యాలెట్ పత్రాల ముద్రణకే. లెక్కింపులో ఆలస్యం, తేడాలు, గిమ్మిక్కులు ఎక్కువ కావడంతో అభ్యర్థుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకునేవి. దీంతో చాలాచోట్ల రెండోసారి, మూడోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. 2014లో దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు ఉండడంతో ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలను తీసుకువచ్చారు. వేల టన్నుల పేపరు వినియోగాన్ని తగ్గించి తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణకు అవకాశాలు మెరుగుపడ్డాయి. దేశంలో తరిగిపోతున్న పచ్చదనాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. -
లక్షలాది చెట్లను బ్యాలెట్ బాక్స్‌ల్లో వేసేశాం!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ఒకప్పుడు ఎన్నికల నిర్వహణ అంతా బ్యాలెట్ పత్రాలపైనే జరిగేది. 1999 ముందు వరకు ఈ విధానమే నడిచింది. ఎన్నికలకు మూడు నెలలకు ముందే ప్రధాన పార్టీలకు చెందిన బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేది. దేశవ్యాప్తంగా ఒకసారి జరిగే ఎన్నికలకు 7,700 టన్నుల బ్యాలెట్ పత్రాలను వినియోగించేవారు. టన్ను పేపరును ఉత్పత్తి చేయడానికి సుమారు 140 చెట్లను కోల్పోవాల్సి వచ్చేది. ఈ లెక్కన ఒక్కో ఎన్నికకు ఎన్ని లక్షల చెట్లను మనం బ్యాలెట్ బాక్సుల్లో వేశామో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చులో కూడా ఉద్యోగుల నిర్వహణ తర్వాత ఎన్నికల సంఘం ఎక్కువగా వెచ్చించేది బ్యాలెట్ పత్రాల ముద్రణకే. లెక్కింపులో ఆలస్యం, తేడాలు, గిమ్మిక్కులు ఎక్కువ కావడంతో అభ్యర్థుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకునేవి. దీంతో చాలాచోట్ల రెండోసారి, మూడోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. 2014లో దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు ఉండడంతో ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలను తీసుకువచ్చారు. వేల టన్నుల పేపరు వినియోగాన్ని తగ్గించి తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణకు అవకాశాలు మెరుగుపడ్డాయి. దేశంలో తరిగిపోతున్న పచ్చదనాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. -
బ్యాలెట్ పేపర్లే ముద్దు: ట్రంప్
వాషింగ్టన్: ఎన్నికల్లో వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే బ్యాలెట్ విధానమే సరైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యం ఉందన్న ఆరోపణలకు బ్యాలెట్ పేపర్లే సమాధానం చెబుతాయని వ్యాఖ్యానించారు. ఇది పాత విధానమే అయినప్పటికీ పెద్దపెద్ద కంప్యూటర్లతో పరిష్కారం కాని సమస్య, కేవలం బ్యాలెట్ పేపర్లను వాడితే తీరుతుందన్నారు.ఈ విధానం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉందనీ, అధ్యక్ష ఎన్నికల్లోనూ తీసుకువచ్చేందుకు హోంలాండ్ సెక్యూరిటీ తదితర భద్రతా సంస్థలు తీవ్రంగా ఆలోచన చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పద్ధతి అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. -
బ్యాలెట్ పత్రాలు స్ట్రాంగ్ రూమ్‌లో భద్రం
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గురువారం ముగిసింది. బ్యాలెట్ పత్రాలను అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. గురువారం అనంతపురం జిల్లాకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలోకి చేర్చారు. వైఎసార్ జిల్లా, కర్నూలు జిల్లాకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు శుక్రవారం రానున్నాయి. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తొలిపోరు నేడే
సాక్షి, నెల్లూరు : ప్రచార, ప్రలోభాల పర్వం ముగిసింది. తొలివిడత పరిషత్ సమరానికి తెరలేచింది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో జరుగుతున్న తొలివిడత పరిషత్ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. 21 మండలాలకు చెందిన జెడ్పీటీసీ స్థానాలతోపాటు ఆ మండలాల పరిధిలోని 267 ఎంపీటీసీ స్థానాలకుగాను తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 258 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 698 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం 911 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,04,671 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3,47,992 మంది పురుషులు కాగా, 3,56,669 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 10 మంది ఉన్నారు. తొలి విడత ఎన్నికల కోసం 1,740 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఐదు వేల మందికిపైగా అధికారులు పోలింగ్ నిర్వహణలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 148 అతి సమస్యాత్మక, 158 సమస్యాత్మక, 11 తీవ్రవాదుల అలికిడి ఉన్న పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 47 చోట్ల వెబ్‌కెమెరాలు, 152 చోట్ల వీడియోగ్రాఫర్లను నియమించారు. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిదశ పోలింగ్... జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రంపేట, మర్రి పాడు, సంగం, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు, కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, వరికుంటపాడు, కొండాపురం, దుత్తలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 21 మంది పోటీలో ఉండగా టీడీపీకి సంబంధించి 21 మంది బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం ఆరు చోట్ల మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు రెండు చోట్ల, బీఎస్పీ అభ్యర్థులు నాలుగు చోట్ల, సీపీఎం రెండు చోట్ల, ఇండిపెండెంట్లు 17 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 73 మంది జెడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఎంపీటీసీలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ తరపున 255 మంది పోటీలో ఉండగా, టీడీపీ తరపున 243 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 44 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి తొమ్మిది మంది, బీఎస్పీ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఐదుగురు పోటీలో ఉండగా, సీపీఎం నుంచి 27 మంది, 111 మంది ఇండిపెండెంట్లు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 698 మంది పోటీలో ఉన్నారు. బ్యాలెట్ వివరాలు... జెడ్పీటీసీకి సంబంధించి మొదటి విడత ఎన్నికల్లో 7,85,350 బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయగా, ఎంపీటీసీకి సంబంధించి 7,63,300 బ్యాలెట్ పేపర్లను తొలివిడత ముద్రించి సిద్ధంగా ఉంచారు.