
Rajeev Kanakala About Clashes with Suma: టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో సుమ-రాజీవ్ కనకాల కూడా ఒకరు. ఓవైపు యాంకరింగ్‌లో మకుటం లేని మహారాణిలా సుమ చెలామణి అవుతుంటే, నటుడిగా రాజీవ్ కనకాల తమ కెరియర్‌లో దూసుకుపోతున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహబంధంలో పొరపాచ్చాలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోనే ఉంటూ ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లో ఉండటం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజీవ్ కనకాల.. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
'నిజంగానే కొన్నిరోజులు సుమతో విడిగా ఉండాల్సి వచ్చింది. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న దేవదాస్ కనకాల ఒక్కరే మణికొండలోని సొంతింట్లో ఉండేవారు. నాన్నను మా ఫ్లాట్‌కు తీసుకువద్దాం అనుకుంటే ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉండేది. దీంతో అది మా ఫ్లాట్‌లోకి షిఫ్ట్ చేయడం కష్టమయ్యింది. దీంతో నాన్నతో పాటు నేను మణికొండలో ఉండిపోయాను.
అంతే తప్పా సుమతో విడిపోయి కాదు. మేమిద్దరం వేరేవేరు ఇళ్లలో ఉండటంతో సుమ-రాజీవ్ కనకాల విడిపోయారు. త్వరలోనే విడాకులు తీసుకుంటారు అంటూ ఏవేవో వార్తలు రాశారు. అందులో ఏమాత్రం నిజం లేదు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు' అంటూ రాజీవ్ పేర్కొన్నాడు. ఇటీవలె నారప్ప సినిమాలో రాజీవ్ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment