లక్సెట్టిపేట్(ఆదిలాబాద్): ఆస్తి పంపకాల్లో తేడాలు..ఆ అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాయి. గొడవ ముదిరి ఒకరి ప్రాణం తీసేదాకా వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ మండలం లక్ష్మింపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకరయ్య, గంగయ్య అన్నదమ్ములు.
తమకు సంక్రమించిన ఆస్తి పంపకాల్లో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం గొడవపడ్డారు. ఆవేశంతో ఉన్న గంగయ్య అన్న శంకరయ్య(45)ను రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి తగాదాలతో అన్నను చంపేశాడు..
Published Wed, May 11 2016 3:47 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
Advertisement
Advertisement