మాగనూరు: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కొల్టూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకరప్ప(45) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
Published Sat, Jan 30 2016 5:34 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement