వివాహేతర సంబంధమే కారణం!
పోలీసుల అదుపులో నిందితుడు
శ్రీకాకుళం జిల్లా : తులగాం గ్రామంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యూడు. దీనికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణ, పాతపట్నం సీఐ బీఎస్‌ఎస్ ప్రకాష్, స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వరరావు మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శ్రీకాకుళం క్లూస్‌టీం సీఐ డి.కోటేశ్వరరావు హత్య జరిగిన ప్రదేశంలో నమోనాలు సేకరించారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ తెలిపిన వివరాలు..
తులగాం గ్రామానికి చెందిన కమడాన లక్ష్మీనారాయణ అదే గ్రామానికి చెందిన మెడతాల సంజీవరావును(36) హత్య చేశాడు. సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో పొలం పని చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న సంజీవరావును పథకం ప్రకారం లక్ష్మీనారాయణ మాటు వేసి వెనుక నుంచి కర్రతో బలంగా కొట్టాడు. దీంతో సంజీవరావు పడిపోవడంతో కొంత దూరం ఈడ్చుకొని వెళ్లి తలపై కత్తితో కొట్టి హత్య చేశాడు.
తన భార్యతో సంజీరావు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నందునే హత్య చేసినట్టు లక్ష్మీనారాయణ అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. అరుుతే లక్ష్మీనారాయణకు ఇంకెవరైనా సహకరించారా? అన్న కోణంలో విచారణ చేపడుతున్నామని చెప్పారు. మృతుని భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైనీ ఎస్‌ఐ వై.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య విజయలక్ష్మి, కుమార్తె భవాని, కుమారుడు మణికంఠ ఉన్నారు.
తులగాంలో హత్య
Published Wed, Jul 13 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement
Advertisement