ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హన్వాడ(మహబూబ్‌నగర్): భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి నిలదీయడంతో, ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన సంఘటన సోమవారం ఉద యం మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన మొద్దు వెంకటేష్(37)కు బుద్దారం గ్రామానికి చెందిన మాధవితో పదేళ్ల క్రి తం వివాహం జరిగింది. కాగా భార్య నాగర్‌కర్నూల్‌కు చెందిన జంగం రమేష్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.
ఈ విషయాన్ని గుర్తించిన భర్త వెంకటేష్ మందలించాడు. దీంతో భార్య భర్తను ఎలాగైనా అంతమొందించాలనే నిశ్చయించుకుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన భర్త ఆదివారం రాత్రి ఎప్పటిలా భోజ నం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అప్పటికే ప్రణాళిక రచించిన భార్య మాధవి రమేష్‌తో కలి సి భర్త వెంకటేష్ గొంతునులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి నాయినోనిపల్లి శివారులో ప్రధాన రహదారిపై వేసి రోడ్డు ప్రమాద ంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమ ంలో పెట్రోలింగ్‌లో ఉన్న హన్వాడ పోలీసులు ప్ర ధాన రహదారిపై వారిని గుర్తించారు. మృతదేహా న్ని వదిలి పారిపోతుండగా వెంబడించి పట్టు కుని ఠాణాకు తరలించారు. వెంకటేష్‌కు భార్యతోపాటు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఈ ఘటనపై వెంకటేష్ తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment