యశవంతపుర: భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికెళ్లిన భార్య, ఆమె బంధువులు గొడవకు దిగారు. బెంగళూరులో మారుతీ లేఔట్ దొడ్డగుబ్బి మెయిన్‌రోడ్డులో ఈ ఘటన జరిగింది. వివరాలు.. ఓ మహిళ ఇంటి నిర్మాణానికి కంకర, ఇసుకను శరణ్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసింది. ఈ సమయంలో పరిచయం పెరిగి అక్రమ సంబంధం ఏర్పడింది.
ఇది తెలిసి శరణ్ భార్య సుమంత ఆ మహిళను మందలించడంతో ఆమె శరణ్‌తో మాట్లాడటం మానేసింది. అయితే కొంతకాలంగా ఇద్దరూ తిరిగి దగ్గరయ్యారు. ఒక మాల్‌కు వెళ్లారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న రాత్రి 11:30 గంటలకు కెంపరాజు, శరత్‌లతో కలిసి సుమంత, ఆ మహిళ ఇంటికి వెళ్లి కిటికీ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మరోసారి తన భర్తతో కనిపిస్తే బాగుండదని హెచ్చరించింది.
వారి దాడి వల్ల తనకు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు మహిళ కొత్తనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆమె ఆరోపించింది. గొడవ చేసిన వీడియోలను సాక్ష్యంగా ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment