తమిళనాడు: ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని సిత్తేరి రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన విఘ్నేష్ (24) శ్రీపెరంబుదూరు సమీపంలోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య యామిని (22). ఆదివారం రాత్రి ఇంటిలో నుంచి బయటకు వెళ్లిన విఘ్నేష్ సోమవారం ఉదయం సిత్తేరి మామిడి తోట సమీపంలో హత్యకు గురయ్యాడు.
అరక్కోణం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో విఘ్నేష్ బంధువైన తండలం ప్రాంతానికి చెందిన సతీష్ (24) ప్రమేయం ఉన్నట్లు తేలింది. విఘ్నేష్ ఇంటికి వెళ్లి వచ్చే సమయంలో యామినితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో అడ్డు తొలగించుకునేందుకే విఘ్నేష్‌ను హత్య చేసినట్లు సతీష్ తెలిపాడు. కాగా సతీష్‌కు సహకరించిన యామిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment