పళ్లిపట్టులో డీఎంకే ఆందోళన
పళ్లిపట్టు: ఉపాధి హామీ పనులకు సంబందించి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా డీఎంకే శనివారం ఆందోళన చేసింది. ఆర్కేపేట వెస్ట్ యూనియన్ డీఎంకే ఆధ్వర్యంలో అమ్మయార్‌కుప్పంలో ఆ పార్టీ మండల కార్యదర్శి షణ్ముగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రం వెంటనే రూ.4వేల కోట్ల ఉపాధి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పళ్లిపట్టు సౌత్ మండల డీఎంకే ఆధ్వర్యలో పళ్లిపట్టు తపాలా కార్యాలయం వద్ద ఆ పార్టీ మండల కార్యదర్శి సీజే.శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇందులో వెయ్యికి పైగాఊపాధి కూలీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజీ.కండ్రిగలో తిరుత్తణి మండల డీఎంకే కార్యదర్శి రాజేంద్రన్, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొన్నారు.


