చెమరంబాక్కంకు నీరు విడుదల
తిరువళ్లూరు: చైన్నె తాగునీటి అవసరాల కోసం కండలేరు నుంచి విడుదల చేసిన నీరు శనివారం ఉదయం 11 గంటలకు పూండి రిజర్వాయర్‌కు చేరింది. రెండు రాష్ట్రాల మధ్య జరిగిన జల ఒప్పందంలో భాగంగా ప్రతి ఏటా 12 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైన్నె తాగునీటి అవసరాల కోసం విడుదల చేయాల్సి వుంది. ఈ క్రమంలో చైన్నెకి తాగునీటి అందించే ప్రధాన రిజర్వాయర్ల నీటి మట్టం వేగంగా తగ్గిన క్రమంలో కండలేరు నుంచి నీటిని విడుదల చేయాలని తమిళనాడు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో భాగంగానే గత 25న కండలేరు నుంచి సెకనుకు 500 క్యూసెక్‌ల నీటిని విడుదల చేశారు. ఈ నీరు తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన జీరో పాయింట్‌కు శుక్రవారం చేరగా అధికారులు పూలు చల్లి స్వాగతం పలికారు. ఇదే క్రమంలో జీరో పాయింట్ నుంచి 25కిమీ ప్రవహించి పూండి రిజర్వాయర్‌కు శనివారం ఉదయం 11 గంటలకు చేరింది. ప్రస్తుతం పూండిలో రెండున్నర టీఎంసీల మేరకు నీరు నిల్వ వున్న క్రమంలో శనివారం ఉదయం చెమరంబాక్కంకు 500 క్యూసెక్ నీటిని విడుదల చేశారు.
చెమరంబాక్కంకు నీరు విడుదల


