
రూ. 65 లక్షల మోసం
●ఇద్దరి అరెస్ట్
తిరువొత్తియూరు: ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసిస్తామని మహిళ వద్ద రూ.65 లక్షలు మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె, కొలతూరు ప్రాంతానికి చెందిన జమున (30). ఈమె షోలింగనల్లూరుని ఐటీ కంపెనీలో ఉద్యోగి. అక్కడ వండలూరు ఓటేరి ప్రాంతానికి చెందిన హరీష్ (30 ) పరిచయమయ్యాడు. తనకు అప్పు ఉన్నట్లు జమున అతనితో చెప్పింది. వేలచేరికి చెందిన సతీష్ మూలంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే బ్యాంకులో రుణం తీసిస్తానని అప్పు తీర్చవచ్చని సతీష్ నమ్మించాడు. దీంతో కోడంబాకంకు చెందిన లోన్ ఏజెంట్ సతీష్ కుమార్‌ను సంప్రదించి జమున తన ఇంటి ఆస్తి పత్రాలను ప్రైవేటు బ్యాంకులో ఉంచి రూ.7 లక్షలు రునంతీసుకున్నారు. తర్వాత జమున ఆస్తి పత్రాలతో ఐదుగురికి పైగా ప్రైవేట్ బ్యాంకులో రూ.65 లక్షల 50 వేలు వరకు అప్పు తీసుకున్నారు. ఈ నగదు అంతా జమున బ్యాంకు ఖాతాలో జమ అయింది. దీంతో హరీష్, సతీష్, సతీష్ కుమార్ ఈ నగదును జమున నుంచి 13 మందికి బదిలీ చేసుకున్నారు. నగదులో జమునకు రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఈ తర్వాత బ్యాంకుకు ఎటువంటి నగదు చెల్లించకుండా జమునతో మాట్లాడడం మానేశారు. దీనికి సంబంధించి చైన్నె పోలీస్ కమిషనర్ వద్ద జమున ఫిర్యాదు చేశారు. దీంతో ఓటేరి క్రైమ్ సీఐ జయప్రకాష్ నేతృత్వంలో పోలీసులు విచారణ జరిపి హరీష్ (29), లోన్ ఏజెంటు సతీష్(32)లను అరెస్టు చేశారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని సినీనటి ఈషారెబ్బా, దర్శకుడు తరుణ్ భాస్కర్ శనివారం వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డు ప్రసాదాలతో సత్కరించారు.
వేడుకగా శ్రీగోవిందరాజస్వామి ఆస్థానం
తిరుపతి కల్చరల్: అన్నమాచార్య కళామందిరంలో జరిగిన అన్నమయ్య 522వ వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా చివరిరోజు శనివారం శ్రీగోవిందరాజస్వామి వారి ఆస్థానం వేడుకగా నిర్వహించారు. అనంతరం అన్నమయ్య రచించిన సంకీర్తనలను ప్రాజెక్టు కళాకారులు గానం చేశారు. ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా అన్నమాచార్య కళామందిరానికి, తిరిగి ఉదయం 10 గంటలకు ఉత్సవమూర్తులను ఆలయానికి వేంచేపు చేశారు. ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు రాజగోపాలరావు పాల్గొన్నారు.

రూ. 65 లక్షల మోసం