
చెరువులో మునిగి నవ దంపతులు మృతి
సేలం: రామనాథపురంలోని చెరువులో స్నానం చేస్తుండగా మునిగి నవ దంపతులు మృతిచెందారు. రామనాథపురం వైగై నగర్‌కు చెందిన కార్తీక్ రాజా (27). ఇతని భార్య షర్మిల(23). వీరికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం కార్తీక్ రాజా, షర్మిలా దంపతులు కట్టురాణి ప్రాంతంలోని స్నానానికి చెరువు వద్దకు వెళ్లారు. ఆ తర్వాత వారు చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఈ విషయాన్ని బంధువులు కెనికరై పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని 3 గంటల పాటు తీవ్రంగా గాలించి నీటిలో మునిగి పోయిన ఉన్న కార్తీక్ రాజా, షర్మిలా మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను శవపంచనామా నిమిత్తం రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కెనికరై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెరువలో స్నానం చేస్తుండగా లోతైన ప్రాంతంలోకి వెళ్లి దంపతులు మునిగిపోయి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.