పాపం నందిని
చిన్నారిని హత్య చేసిన కర్కోటకుడు
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల చిన్నారిని అంతమొందించాడో కర్కోటకుడు. హత్య చేసి హౌస్‌లో పడేశాడు. పాప హౌస్‌లో పడి చనిపోరుుందని తల్లిని నమ్మించాడు. పోలీసులు తమదైన శైలిలో విచా రించగా.. హత్యచేసి వాగులో పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఘటనతో చిట్యాల మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది.
- నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసిన కర్కోటకుడు
- అంకుషాపూర్‌లో విషాదం
చిట్యాల: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల చిన్నారిని అంతమొందించాడో కర్కోటకుడు. హృదయూలను కలిచివేసిన ఈ ఘటన చిట్యాల మండలంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్, ఎస్సై వెంకట్రావు కథనం.. మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన జీడి పైడయ్యకు ఇదే మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన రాధతో ఇరువై ఏళ్ల క్రితం వివాహామైంది. ఆలస్యంగా కాన్పు కాగ నందిని (4) జన్మించింది. ఈ క్రమంలో కాలనీకి చెందిన వరుసకు మరిది అయిన జీడి రవి వదిన రాధతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నెల రోజుల క్రితం రాధ, ఆమె కుమార్తె నందినిని తీసుకెళ్లి కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజ్‌పల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఇద్దరు కూలీపనికి వెళ్తూ బతుకుతున్నారు. గత నెల 19న రాధ పొలం పనికి వెళ్లగా రవి ఇంటివద్దే ఉన్నాడు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఇంట్లో ఉన్న నందినిని హత్య చేసి ఇంట్లోని నీటిహౌస్‌లో పడేశాడు. పాప హౌస్‌లోపడి చనిపొయిందని తల్లి రాధను నమ్మించాడు. అదే రాత్రి పక్కనే గల మల్యాల చలివాగులో పాపను పూడ్చిపెట్టాడు. అయితే గత నెల 27న అంతకుముందే తన భార్య రాధ, కుమార్తె నందిని అదృశ్యమయ్యూరని, కాలనీకి చెందిన జీడి రవిపై అనుమానం ఉందని పైడయ్య ఫిర్యాదు చేశాడు. విచారణ కోసం రంగలంలోకి దిగిన పోలీసులు మంగళవారం కమలాపూర్‌లోని రవి, రాధలను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలీలో విచారించగా నందినిని హత్యచేసి వాగులో పూడ్చిపెట్టినట్లు రవి ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు వాగువద్దకు వెళ్లి నందిని మృతదేహాన్ని వెలికితీశారు. జమ్మికుంట తహశీల్దార్ రజిని, ఆర్‌ఐ సందీప్‌ల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టంనకు తరలించారు. నిందితులు రవి, రాధలపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్, ఎస్సై వెంకట్రావు వివరించారు. చిన్నారిని హత్య చేసిన ఘటన మండలంలో సంచలనం సృష్టించింది.