ఫైల్ ఫొటో
సాక్షి, విశాఖపట్నం: వందేభారత్ రైలు బోగీలపై గుర్తు తెలియని ఆగంతకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కంచరపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో రాళ్లు తగిలి రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించాల్సి ఉంది.
అందులో భాగంగానే ట్రయల్ కోసం చెన్నై నుంచి విశాఖ వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డీఆర్‌ఎం అనూప్ సత్పతి ఘటనపై విచారణకు ఆదేశించారు. రాళ్లదాడిని వాల్తేరు డివిజన్ అధికారులు నిర్ధారించారు.
చదవండి: (మోస్ట్ వాంటెడ్ హిడ్మా.. చరిత్ర అంతా చిక్కడు దొరకడు..!)
Comments
Please login to add a commentAdd a comment