విశాఖకు మరో వందే భారత్‌! | Another Vande Bharat Train For Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖకు మరో వందే భారత్‌!

Published Tue, Sep 10 2024 4:48 AM | Last Updated on Tue, Sep 10 2024 4:48 AM

Another Vande Bharat Train For Visakhapatnam

తాటిచెట్లపాలెం: వేగవంతమైన ప్రయాణానికి పేరొందిన వందే భారత్‌ రైళ్లను మరింత విస్తరించే దిశగా ప్రయ­త్నాలు జరుగుతు­న్నాయి. ఇందులో భాగంగా మరో వందే భారత్‌ రైలును విశాఖకు నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే సిద్ధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖ­పట్నం, సికింద్రాబాద్‌–విశాఖపట్నం–సికింద్రాబాద్‌కు రెండు వందే భారత్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

మూడో వందేభారత్‌ దుర్గ్‌–విశాఖపట్నం–దుర్గ్‌ మధ్య నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వాల్తేర్‌ డివిజన్‌ నుంచి ఏ విధమైన అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ రైలు నడిచేది మాత్రం వాస్తవమేనని తెలిసింది. కొంచెం మార్పులతోనైనా లేదా ఇదే విధంగానైనా దుర్గ్‌–విశాఖపట్నం–దుర్గ్‌ వందే భారత్‌ రాక­పోకలు సాగించనుంది. దుర్గ్‌–­విశాఖ­పట్నం(20829) వందే«భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో విశాఖ­పట్నం–దుర్గ్‌(20830) వందే భారత్‌ మధ్యా­హ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌ చేరుకుంటుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement