భువనగరి (నల్లగొండ): ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న సమయంలో నడుస్తున్న ఓ ఆర్టీసీ బస్సుపై నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో బస్సు అద్దాల పగిలి ఓ ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంత వాసులని సమాచారం.