కరీంనగర్: అభం శుభం తెలియని చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీకి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నగరంలోని శ్రీకృష్ణానగర్‌లో గురువారం వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానికంగా ఉన్న శ్రీసాయి హై స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న చిన్నారితో అదే పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న గోపి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని బాధితురాలి తల్లదండ్రులు చేసిన ఫిర్యాదును పాఠశాల యాజమాన్యం పెడచెవిన పెట్టింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధవులు గురువారం పాఠశాలకు వచ్చి పీఈటీ గోపికి దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు.
అసభ్య ప్రవర్తన.. పీఈటీకి దేహశుద్ధి
Published Thu, Jul 27 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM
Advertisement
Advertisement