శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికపై ఆదివారం గుర్తు తెలియని దుండగుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన మరో ఇద్దరు విద్యార్థినులు కేకలు వేయడంతో పారిపోయాడు. వివరాలు... పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ఉంది. ఇక్కడ ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 602 వుంది బాలికలు చదువుతున్నారు.
ఆదివారం ఉదయం 9.20 గంటల సవుయుంలో విద్యార్థినులు టిఫిన్ చేయడానికి క్యాంటీన్‌కు వెళ్లారు. ఆరో తరగతి చదువుతున్న కోవనూరుకు చెందిన లోకేశ్వరి(11) తొందరగా టిఫిన్ తిని వచ్చి హోంవర్క్ చేసుకుంటోంది. గుర్తు తెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి లోపలికి చొరబడ్డాడు. బాలిక వద్దకు చేరుకుని అమాంతం గొంతునులిమాడు. బాలిక అక్కడే స్ఫృహ కోల్పోయింది. దీన్ని గమనించిన మరో ఇద్దరు విద్యార్థినులు కేకలు వేయడంతో ఆ దుండగుడు పారిపోయాడు. బాధిత బాలికను ప్రిన్సిపాల్ ద్వారకానాథ్‌రెడ్డి ఆస్పత్రికి తరలించారు.
పోలీసులతోపాటు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. రెండు గంటల తర్వాత కోలుకున్న ఆ బాలికను తిరిగి పాఠశాలకు తీసుకువచ్చారు. అప్పటికే విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ తమ పిల్లలకు భద్రత లేదని, ఇంటికి పంపేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. టూటౌన్ సీఐ వేణుగోపాల్, ఎమ్మార్వో చంద్రమోహన్, ఎంఈవో బాలయ్యు పాఠశాలకు వెళ్లి బాలికను విచారించారు. ఈ సందర్భంగా సీఐ వేణుగోపాల్ వూట్లాడుతూ... 24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అయితే పాఠశాలలో భద్రత కరువైందని తల్లిదండ్రులు ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లారు.
పట్టపగలే గురుకులంలో బాలికపై హత్యాయత్నం!
Published Sun, Feb 28 2016 8:15 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
Advertisement
Advertisement