మృతి చెందిన ప్రణతి (ఫైల్)
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈనెల 14వ తేదీన చికిత్స పొందుతూ కూరపాటి ప్రణతి (16) అనే విద్యార్థిని మతిచెందిన వైనంపై ఫిర్యాదులు రావటంతో మంగళవారం ఐదు గంటలపాటు విచారణ జరిగింది. జీజీహెచ్ డెప్యూటీ సూపరింటెండెంట్, విచారణ కమిటీ అధికారి డాక్టర్ పెనుగొండ యశోధర వైద్యులు, వైద్య సిబ్బందిని విచారించారు. జ్వరంతో వచ్చిన విద్యార్థినిని వైద్యులు పట్టించుకోకపోవటం వల్లే ప్రణతి మృతి చెందిందని తల్లిదండ్రులు నాగరాజు, సుజాతలు ఆస్పత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన రోజు∙ కుటుంబ సభ్యులు సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయటంతో సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడుడాక్టర్ విద్యార్థిని మృతిపై విచారణ చేయాల్సిందిగా యశోధరను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు మంగళవారం విచారణ జరిగింది.