![Car Washed Away In Flood In Anantapur District - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/3/Anantapur-District.jpg.webp?itok=8UkIBmJ5)
సాక్షి, అనంతపురం: కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కదిరి-పులివెందుల మధ్య ఒదులపల్లి వంకలో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి బాబ్జాన్, డ్రైవర్ రఫీ గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షింతగా బయటపడ్డారు. బాబ్జాన్ మృతదేహం లభ్యం కాగా, రఫీ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బీఫార్మసీ సర్టిఫికెట్ తెచ్చుకునేందుకు కదిరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది.
కదిరి-పులివెందుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరా అవుతాడనుకున్న తమ బిడ్డ ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్టిఫికెట్‌తో వస్తాడనుకున్న తమ బిడ్డ విగత జీవిగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చదవండి:
అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..
యువతికి వేరొకరితో నిశ్చితార్థం.. వాట్సాప్‌లో అశ్లీల ఫొటో
Comments
Please login to add a commentAdd a comment