అప్పులబాధతో యువకుడి బలవన్మరణం | young man committed suicide by debt | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో యువకుడి బలవన్మరణం

Published Mon, Apr 10 2017 11:11 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

అప్పులబాధతో యువకుడి బలవన్మరణం - Sakshi

అప్పులబాధతో యువకుడి బలవన్మరణం

తనకల్లు(కదిరి):

తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన అంజినప్ప(38 సోమవారం ఆత్యహత్య చేసుకున్నట్లు బంధువులు, పోలీసులు తెలిపారు. గాజుల వ్యాపారంతో పాటు నర్సరీలో పని చేస్తుండే అంజినప్ప  వ్యాపారం కోసం అప్పులు చేశాడు. అయితే నష్టాలు రావడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మధనపడుతూ ఉండేవాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని తనువు చాలించినట్లు వివరించారు. గమనించిన స్థానికులు, బంధువులు చికిత్స కోసం హుటాహుటిన తనకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు అక్కడ పరీక్షించిన వైద్యులు నిర్ధరించారు. మృతునికి భార్య అలివేలు సహా కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement