
సాక్షి, అనంతపురం: కదిరి అర్బన్ సీఐ మల్లికార్జున గుప్తాపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ మల్లికార్జున గుప్తాపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపి ఆ నివేదికను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అనంతపురం రేంజ్ డీఐజీకు పంపారు. ఈ నివేదిక ఆధారంగా సీఐను డీఐజీ సస్పెండ్ చేశారు. జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న పోలీసులు ఏ హోదాల్లో ఉన్నా చర్యలు తప్పవని, అలాంటి వారిపై ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment