పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం
Published Thu, Apr 13 2017 11:24 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
అయిదుగురు అరెస్ట్
కదిరి(అనంతపురం): పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లాలోని కదిరికి చెందిన పదో తరగతి విద్యార్థినిని స్థానికంగా నివాసముంటున్న ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి పరీక్షలు రాయడానికి వచ్చిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపాడు.
ఈ అంశంపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement