'న్యాయం చేస్తానని చెప్పి...గర్భవతిని చేశాడు' | sexual harrasament on tenth class student for four months at Anathapur district | Sakshi
Sakshi News home page

'న్యాయం చేస్తానని చెప్పి...గర్భవతిని చేశాడు'

Published Tue, Nov 11 2014 8:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

'న్యాయం చేస్తానని చెప్పి...గర్భవతిని చేశాడు' - Sakshi

'న్యాయం చేస్తానని చెప్పి...గర్భవతిని చేశాడు'

అనంతపురం : న్యాయం చేస్తానని చెప్పి.. ఓ మైనర్‌ను గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్‌ అనే వ్యక్తి  తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ బాలిక జిల్లా ఎస్పీ రాజశేఖరబాబును ఆశ్రయించింది. అనంతరం బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి పీపుల్స్ వాయిస్ ఫర్ ఛైల్డ్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో కలిసి కదిరి డీఎస్పీ దేవదానంకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే కదిరిలో పదవ తరగతి చదువుతున్న బాలిక తనను పాఠశాలలో ఓ విద్యార్ధి వేధిస్తున్నాడంటూ హెడ్మాష్టర్‌కు ఫిర్యాదు చేసింది. కాగా  ఈ విషయం తెలుసుకున్న ఇలియాజ్ న్యాయం చేస్తానంటూ ఆ బాలికను తన ఇంటికి తీసుకు వెళ్లాడు. మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. నాలుగు నెలలుగా ఆమెపై అత్యాచారం జరపటమే కాకుండా చిత్రహింసలు పెట్టాడు. ఈ  కీచకపర్వాన్ని తన సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. విషయం బయటకు పొక్కితే కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ ఆ బాలికను బెదిరించాడు.

కాగా ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి...ఇలియాజ్తో  గొడవకు దిగింది. అయితే ఆమెను సైతం అతడు బెదిరించటంతో ఆ కుటుంబం భయాందోళనలకు గురైంది. విషయం తెలుసుకున్న పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సభ్యులు జిల్లా ఎస్పీకి, కదిరి డీఎస్పీకి సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..పరారీలో ఉన్న ఇలియాజ్‌ కోసం గాలిస్తున్నారు.

(ఇంగ్లీష్ కథనం కోసం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement