
తిరువీధుల్లో ఊరేగిన లక్ష్మీ నారసింహుడు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు అండాళ్ తిరునక్షత్రం సందర్భంగా బుధవారం శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరువీధుల్లో ఊరేగుతూ తన భక్తులను దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి తిరువీధుల ఉత్సవ సమయంలో తిరువీ«ధుల్లో భక్తులు ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవిందా’ అంటూ స్వామివారి నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ ఉత్సవ ఉభయదారులుగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీహరిప్రసాద్ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పార్థసారథి, నరసింహాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.