laxmi narasimha
-
తిరువీధుల్లో ఊరేగిన లక్ష్మీ నారసింహుడు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు అండాళ్ తిరునక్షత్రం సందర్భంగా బుధవారం శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరువీధుల్లో ఊరేగుతూ తన భక్తులను దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి తిరువీధుల ఉత్సవ సమయంలో తిరువీ«ధుల్లో భక్తులు ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవిందా’ అంటూ స్వామివారి నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ ఉత్సవ ఉభయదారులుగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీహరిప్రసాద్ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పార్థసారథి, నరసింహాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
కనుల పండువగా కల్యాణోత్సవం
ఉరవకొండ రూరల్ : మండల పరిధిలోని శ్రీలక్ష్మీ నృసింహుని బ్రహ్మరథోత్సవ వేడుకల్లో భాగంగా అత్యంత కీలకమైన శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి పలు పూజా కార్యక్రమాల అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత శ్రీలక్ష్మీ నృసింహుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వేద పండితుల మధ్య స్వామివారి కల్యాణోత్సవ వేడుకలు వేలాదిమంది భక్తాదుల నడుమ సందడిగా సాగింది. ఉత్సవ ఉభయదాతలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
హంస వాహనంపై ఊరేగిన లక్ష్మీనృసింహుడు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు ఆధ్వర్యంలో భూదేవి, శ్రీదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహుడిని ప్రత్యేకంగా అలంకరించి హంస వాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు.