కనుల పండువగా కల్యాణోత్సవం
ఉరవకొండ రూరల్ : మండల పరిధిలోని శ్రీలక్ష్మీ నృసింహుని బ్రహ్మరథోత్సవ వేడుకల్లో భాగంగా అత్యంత కీలకమైన శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి పలు పూజా కార్యక్రమాల అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత శ్రీలక్ష్మీ నృసింహుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వేద పండితుల మధ్య స్వామివారి కల్యాణోత్సవ వేడుకలు వేలాదిమంది భక్తాదుల నడుమ సందడిగా సాగింది. ఉత్సవ ఉభయదాతలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.