కదిరిలో దారుణం | husband murdered his wife in kadiri | Sakshi
Sakshi News home page

కదిరిలో దారుణం

Published Fri, Apr 14 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

కదిరిలో దారుణం

కదిరిలో దారుణం

- పెళ్లాన్ని అతి కిరాతకంగా నరికి చంపిన భర్త
- తాగుడుకు డబ్బు ఇవ్వలేదన్న కసితోనే...

కదిరి టౌన్‌ : కదిరిలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే తన భార్యను కాటికి పంపాడు. పోలీసుల కథనం ప్రకారం...  కదిరి మున్సిపల్‌ పరిధిలోని బాబాకాలనీకి చెందిన వడ్డెర బాలకృష్ణ వివాహం తలుపులకు చెందిన లావణ్య అయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తున్న బాలకృష్ణ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తరచూ భార్యను మద్యం కోసం డబ్బులివ్వమని వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.

పోలీసులను ఆశ్రయించినా...
తన భర్త వేధింపుల నుంచి కాపాడాలంటూ గతంలో అనేక మార్లు లావణ్య తలుపుల పోలీసులకు  ఫిర్యాదు చేసింది. అయినా భర్తలో ఎలాంటి మార్పు రాకపోగా.. బుధవారం రాత్రి ఇద్దరి మరోసారి భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆ తరువాత ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై  గురువారం తెల్లవారుజామున కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. ఆ తరువాత అతను పరారయ్యాడు.

రంగంలోకి పోలీసులు
కదిరి డీఎస్పీ వెంకటరామాంజనేయులు, నల్లమాడ సీఐ శివరాముడు, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సంఘటనా స్థలికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. హతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement