husband murdered his wife
-
Uppal: ఆలిని చంపి అదృశ్యమయ్యాడు
ఉప్పల్: కట్టుకున్న ఇల్లాలిని అనుమానంతో హత్య చేసి పారిపోయిన ఓ భర్త ఉదంతం ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ బోలా ఆరు నెలల క్రితం నగరానికి వలస వచ్చాడు. భార్య మధుస్మిత (24)తో కలిసి వచ్చి ఉప్పల్ న్యూ భరత్‌నగర్‌లో అద్దె గదిలో వీరు నివాసముంటున్నారు. వీరికి 10 నెలల కుమారుడు ఉన్నాడు. ప్రదీప్ ఉప్పల్ భగాయత్‌లోని కోణార్క్ టిఫిన్ సెంటర్లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ప్రదీప్ ఉంటున్న ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు 100కు డయల్ చేసి సమాచారం అందించారు. ఉప్పల్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూంలో గోనె సంచిలో శవాన్ని కుక్కి మూటగట్టి ఉంది. అందులోంచి కుళ్లిన దుర్వాసన వస్తోంది. మూటను విప్పి చూడగా నాలుగు రోజుల క్రితం భార్య మధుస్మితను ప్రదీప్ హత్య చేసి మూటగట్టి పడేసి.. కుమారుడితో పారి పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతోనే ఆమెను హత్య చేసి పారిపోయి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: భార్య గొంతు కోసి ఆపై భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఐ.ఎస్.సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం... చంపాపేట్ ఎస్జీఆర్ కాలనీలో స్వప్న (21) ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటోంది. అయితే కొద్ది రోజులుగా ఇద్దరు వ్యక్తులు వస్తుండటాన్ని గమనించిన ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని సూచించాడు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మహేశ్వరానికి చెందిన ప్రేమ్ కుమార్ (24) తన భార్య స్వప్నను అతి కిరాతంగా గొంతు కోసి హత్య చేసి తాను కూడా రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఇంటి యజమాని బయటికి వచ్చి చూడగా... ప్రేమ్ కుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అదే సమయంలో ఇద్దరు యువకులు మెట్లు దిగుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయినట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా... స్వప్న రక్తపు మడుగులో పడి మృతి చెందింది. సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ బి.రోహిత్ రాజ్, ఐ.ఎస్.సదన్ ఇన్స్పెక్టర్ ఎస్.మల్లే‹Ùలు, ఇతర పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కలహాల మంటలు..
చిన్నంబావి (వనపర్తి జిల్లా): కుటుంబ కలహాలు వారి జీవితాలను బలితీసుకున్నాయి. జీవితాంతం తోడుండాల్సినవాడే కర్కశంగా మారి నిప్పంటించాడు. వివరాలిలా ఉన్నాయి.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలోని బడికల జయన్న (44)కు సింగోటానికి చెందిన వరలక్ష్మితో 22 ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి కూతురు గాయత్రి (17)తో పాటు కుమారుడు సృజన్ ఉన్నారు. భార్య స్థానికంగా అంగన్వాడీ టీచర్‌గా, భర్త వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూతురు కొల్లాపూర్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే జయన్న కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకుని తరచూ ఇంట్లో గొడవపడేవాడు. రెండు నెలల క్రితం అతను తీవ్రంగా కొట్టడంతో భార్య వరలక్ష్మి కూతురుతో కలసి పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. అనంతరం పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తాగొచ్చి మరోసారి గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో చెలరేగిన మంటల నుంచి జయన్న తప్పించుకునేందుకు యత్నించగా తలుపులు తెరుచుకోలేదు. అంతలోనే భార్య, కూతురు కలసి అతడిని పట్టుకోవడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వారంతా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కూతురు, తండ్రి గురువారం ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
వేరు కాపురం పెట్టి.. భార్య హత్య
గద్వాల క్రైం: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన సోమవారం సాయంత్రం గద్వాలలో చోటు చేసుకుంది. స్థానికులు, పట్టణ ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. గద్వాలలోని తెలుగు రంగన్న, అంజనమ్మల దంపతుల కుమారుడు రామాంజనేయులుకు మల్దకల్ మండలం వామనపల్లికి చెందిన తెలుగు రేణుక(22)తో మూడేళ్ల క్రితం వివాహం చేశారు. అనోన్యంగా ఉంటున్న క్రమంలో రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని రామాంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను ఎలాగైనా అంతం చేయాలని పథకం వేశాడు. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న నేపథ్యంలో భార్యను ఏం చేయలేక గత 20 రోజుల క్రితం రామాంజనేయులు తల్లిదండ్రులతో ఘర్షణ పడి నాయిబ్రాహ్మణకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఇంట్లో భార్యను గొంతునులిమి హత్య చేసి పారిపోయాడు. వీరికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు. సంఘటన జరిగిన విషయాన్ని అదే కాలనీలో గొర్రెలు కాస్తున్న వ్యక్తి ఇంట్లో నుంచి కేకలు రావడంతో అక్కడకి వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రామాంజనేయులుకు ఇదివరకే ఓ మహిళతో వివాహం కాగా విడాకులు ఇచ్చాడు. రేణుక బంధువుల అమ్మాయి కావడంతో గత మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యులు మళ్లీ వివాహం జరిపించారు. రామాంజనేయులు ఓ ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. -
కోరిక తీర్చలేదని హత్యచేసి.. ఆపై కోసుకున్నాడు!
లక్నో: శృంగారానికి ఒప్పుకోలేదన్న ఉన్మాదంతో భార్య గొంతు నలిమి చంపేసి, తన మర్మాంగాన్ని కోసుకున్న వ్యక్తి ఉదంతమిది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ధనగర్ జిల్లా, కాక్రా గ్రామానికి చెందిన అన్వరుల్ హసన్(24) గుజరాత్‌లోని సూరత్‌లో పనిచేస్తుంటాడు. ఇతనికి గతేడాది వివాహమవగా, రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో భార్యను తనతో గడపాలని కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడై ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు వచ్చి చూడగా, హసన్ స్పృహ తప్పి రక్తపు మడుగులో పడిఉన్నాడు. ఆమె అచేతనంగా పడి ఉంది. దీంతో పోలీసులు భార్య మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి, హసన్‌ను చికిత్స కోసం గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ దాస్ ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందని పోలీసులు అడిగితే.. చేసిన దారుణాన్ని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. కాగా, వరకట్నం కోసమే తన కూతురిని చంపేశారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. -
హత్యకు కలిసొచ్చిన పార్టీ మీటింగ్..!
సాక్షి, కనగల్ (నల్లగొండ) : వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అదనపు కట్నం కోసమే కట్టుకున్న భర్తే ఘాతుకానికి తెగబడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యోదంతానికి సహకారం అందించిన ప్రధాన నిందితుడి తల్లిదండ్రితో పాటు ఇద్దరు సోదరులను కూడా అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవీందర్ కేసు వివరాలు వెల్లడించారు. ప్రేమించి పెళ్లి చేసుకుని... శేరిలింగోటం గ్రామానికి చెందిన కన్నెబోయిన సైదులు అదే గ్రామంలో ఉంటున్న కవిత(21)ను ఏడాది క్రితం మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు అన్నల పెళ్లిళ్లు కాకముందే సైదులు మొదట వివాహం చేసుకోవడం అప్పట్లో గ్రామంలో చర్చనీయాంశమైంది. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో రెండు కుటుం బాలు మిన్నకున్నాయి. వరకట్నం రాలేదని.. ఈ క్రమంలో సైదులు ఇద్దరు సోదరుల వివాహాలు అయ్యాయి. అయితే వారికి వరకట్నం రావడంతో సైదులుకు కట్నంపై ఆశ కలిగింది. కవితను పెళ్లి చేసుకోవడంతోనే తనకు కట్నం రాలేదనుకున్న సైదులు ఆరునెలల కాపురం తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న కవితను కట్నం కోసం చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. సైదులు చేస్తున్నది తప్పు అని చెప్పాల్సిన అతని తల్లిదండ్రులతోపాటు ఇద్దరు అన్నలు సహకరించారు. గ్రామంలోనే ఉంటున్న కవిత తల్లిదండ్రులు తరచు తమ కూతురిని కొట్టడంతో పలుమారు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఎన్నికల తర్వాత మట్లాడుదామని గ్రామపెద్దలు చెప్పడంతో కవిత పుట్టింటికీ వెళ్లిపోయింది. పంచాయితీలోనే పరుశ పదజాలంతో సైదులుతోపాటు కుటుంబ సభ్యులు దూషించారు. అప్పటి నుంచి కవిత అడ్డుతొలగించుకునేందుకు పథకం పన్నారు. హత్యకు కలిసొచ్చిన మీటింగ్ హత్య జరిగిన రోజు జిల్లాకేంద్రంలో ఓ పార్టీ ఎన్నికల బహిరంగ సభ ఉండటంతో మెజార్టీ గ్రామస్తులు అక్కడకు వెళ్లారు. అదేరోజు కవిత తల్లిదండ్రులు అబ్బరబోయిన నాగయ్య, వెంకటమ్మలు తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి వెళ్లారు. గ్రామంలో జనం పలుచగా ఉండటం, కవిత తల్లిదండ్రులు ఊర్లో లేకపోవడం, ఒంటరిగా ఉన్న కవితను హత్య చేసేందుకు ఇదే అదునుగా సైదులు భావించాడు. మధ్యాహ్న సమయంలో తల్లిదండ్రులు కౌలు చేస్తున్న పత్తిచేను వద్ద ఉన్న పశువులకు నీళ్లు తాపేందుకు వెళుతుండగా మార్గమధ్యలో కవితను అటకాయించిన సైదులు నీతో మాట్లాడాలని చెప్పి ఆమె వెంట పత్తిచేను వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఘర్షణ జరిగింది. అప్పటికే అంతం చేయాలని భావించిన సైదులు కవిత ఛాతిపై పిడిగుద్దులు గుద్ది దారుణానికి ఒడిగట్టాడు. హత్య జరిగిన అనంతరం సైదులు రెండో అన్న పరమేశ్ కొద్ది దూరంలో బైక్‌పై ఉండగా అక్కడకు చే రుకుని అన్నదమ్ములిద్దరు అక్కడ నుంచి పారిపోయారు. అప్పటికే సైదులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరడంతో అదేరోజు పశువులు, జీవాలను తోలుకుని వెళ్లి శివన్నగూడెంలో విక్రయించారు. అప్పటి నుంచి అందరూ పరారీలో ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. సైదులు తోపాటు ఇద్దరు అన్నలు నరేశ్, పరమేశ్, తల్లిదండ్రులు అం జయ్య, శంకరమ్మలను రి మాండ్‌కు తరలించి నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో కనగల్ ఎస్సై ఎన్. శ్రీను, కాని స్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. -
కదిరిలో దారుణం
- పెళ్లాన్ని అతి కిరాతకంగా నరికి చంపిన భర్త - తాగుడుకు డబ్బు ఇవ్వలేదన్న కసితోనే... కదిరి టౌన్ : కదిరిలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే తన భార్యను కాటికి పంపాడు. పోలీసుల కథనం ప్రకారం... కదిరి మున్సిపల్ పరిధిలోని బాబాకాలనీకి చెందిన వడ్డెర బాలకృష్ణ వివాహం తలుపులకు చెందిన లావణ్య అయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తున్న బాలకృష్ణ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తరచూ భార్యను మద్యం కోసం డబ్బులివ్వమని వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. పోలీసులను ఆశ్రయించినా... తన భర్త వేధింపుల నుంచి కాపాడాలంటూ గతంలో అనేక మార్లు లావణ్య తలుపుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా భర్తలో ఎలాంటి మార్పు రాకపోగా.. బుధవారం రాత్రి ఇద్దరి మరోసారి భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆ తరువాత ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై గురువారం తెల్లవారుజామున కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. ఆ తరువాత అతను పరారయ్యాడు. రంగంలోకి పోలీసులు కదిరి డీఎస్పీ వెంకటరామాంజనేయులు, నల్లమాడ సీఐ శివరాముడు, ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి సంఘటనా స్థలికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. హతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మార్చురీకి తరలించారు. -
అనంతలో దారుణం
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త అనుమానం పెనుభూతమైంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో గొడవపడి కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అనంతపురంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. - అనంతపురం సెంట్రల్ నగరంలోని వినాయక్‌నగర్‌లో చలపతి, సుమతి(34) దంపతులు నివసిస్తున్నారు. వీరికి హేమలత(14), మానస (11), రాఘవేంద్ర (8) సంతానం. చలపతి పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త అనుమానించాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరూ గొడవపడ్డారు. సుమతి పుట్టింటి వారికి కూడా తెలియజేసి మందలించినట్లు సమాచారం. ఒకానొక సమయంలో బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో ఉన్న తమ సొంత ఇంటికి మకాం మార్చాలని భావించాడు. అయితే పిల్లల చదువు దృష్ట్యా విరమించుకున్నాడు. మంగళవారం ఉదయం మరోసారి వివాహేతర విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన చలపతి ఇంట్లో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తి తీసుకొని గొంతుకోసి హతమార్చాడు. అనంతరం పారిపోయాడు. ఉదయాన్నే ఈ ఘటన జరగడంతో వినాయక్‌నగర్‌లో కలకలం రేగింది. కాలనీలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆ ఇంటివద్ద గుమిగూడారు. వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్ఐలు రంగయాదవ్, నాగమధులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడు చలపతి సాయంత్రానికి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు.