కోరిక తీర్చలేదని హత్యచేసి.. ఆపై కోసుకున్నాడు! | Husband Who Murdered His Wife for Refusing to Have Sex | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చలేదని హత్యచేసి.. ఆపై కోసుకున్నాడు!

Published Sun, Jul 7 2019 5:12 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

Husband Who Murdered His Wife for Refusing to Have Sex - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: శృంగారానికి ఒప్పుకోలేదన్న ఉన్మాదంతో భార్య గొంతు నలిమి చంపేసి, తన మర్మాంగాన్ని కోసుకున్న వ్యక్తి ఉదంతమిది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ధనగర్‌ జిల్లా, కాక్రా గ్రామానికి చెందిన అన్వరుల్‌ హసన్‌(24) గుజరాత్‌లోని సూరత్‌లో పనిచేస్తుంటాడు. ఇతనికి గతేడాది వివాహమవగా, రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో భార్యను తనతో గడపాలని కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడై ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు వచ్చి చూడగా, హసన్‌ స్పృహ తప్పి రక్తపు మడుగులో పడిఉన్నాడు. ఆమె అచేతనంగా పడి ఉంది. దీంతో పోలీసులు భార్య మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి, హసన్‌ను చికిత్స కోసం గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ దాస్‌ ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందని పోలీసులు అడిగితే.. చేసిన దారుణాన్ని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. కాగా, వరకట్నం కోసమే తన కూతురిని చంపేశారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement