
హైదరాబాద్: భార్య గొంతు కోసి ఆపై భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఐ.ఎస్.సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎస్.మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం... చంపాపేట్ ఎస్‌జీఆర్ కాలనీలో స్వప్న (21) ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటోంది. అయితే కొద్ది రోజులుగా ఇద్దరు వ్యక్తులు వస్తుండటాన్ని గమనించిన ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని సూచించాడు.
ఇదిలా ఉండగా శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మహేశ్వరానికి చెందిన ప్రేమ్ కుమార్ (24) తన భార్య స్వప్నను అతి కిరాతంగా గొంతు కోసి హత్య చేసి తాను కూడా రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఇంటి యజమాని బయటికి వచ్చి చూడగా... ప్రేమ్ కుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
అదే సమయంలో ఇద్దరు యువకులు మెట్లు దిగుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయినట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా... స్వప్న రక్తపు మడుగులో పడి మృతి చెందింది. సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ బి.రోహిత్ రాజ్, ఐ.ఎస్.సదన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.మల్లే‹Ùలు, ఇతర పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment