స్కూల్‌లో చిన్నారులను తాళ్లతో కట్టి చిత్రహింసలు | Photos Of Punished Kadiri Municipal Students Go Viral | Sakshi
Sakshi News home page

స్కూల్‌లో చిన్నారులను తాళ్లతో కట్టి చిత్రహింసలు

Nov 28 2019 8:49 PM | Updated on Nov 28 2019 8:58 PM

Photos Of Punished Kadiri Municipal Students Go Viral - Sakshi

సాక్షి, అనంతపురం: క్లాస్‌లో అల్లరి చేస్తున్నారనే కారణంతో ముగ్గురు విద్యార్థులను తాళ్లతో బంధించిన ఘటన కదిరి మున్సిపల్ స్కూల్‌లో గురువారం చోటు చేసుకుంది. ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి ఆదేశాల మేరకు పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా నిర్బంధించి ఉంచారు. అయితే అనూహ్యంగా విద్యార్థుల నిర్బంధానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపడంతో.. స్కూల్‌ హెచ్ఎం శ్రీదేవిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. పిల్లలను నిర్బంధం గురించి హైదరాబాద్‌కు చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు(నేషనల్ చైల్డ్‌ కమిషన్‌) ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement