కదిరి : ‘ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదే«శం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తుగా ఓడిపోయింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎలాగైనా ఆ ఎన్నిక జరగకూడదని తన పార్టీ నాయకులతో పాటు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారు’ అని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త పివి సిద్దారెడ్డి ఆరోపించారు. గాండ్లపెంట మండలం కతమతంపల్లిలో ఓ వివాహ వేడుకకు ఆదివారం హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 27మంది కౌన్సిలర్ల మద్దతు ఉందన్నారు. అలాంటి చోట టీడీపీ ఎలా గెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అధికార దర్పంతో అప్రజాస్వామికంగా గెలివాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందన్న విషయం ప్రజలు గ్రహిస్తున్నారన్నారు.
చంద్రబాబు అధికార యంత్రాంగం తొత్తులుగా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. ఎప్పటికీ నాయకులు శాశతం కాదన్న విషఁం అధికారులు గ్రహించాలన్నారు. ప్రొద్దుటూరులో ఇప్పటికే రెండు సార్లు టీడీపీ నాయకులు గొడవకు దిగి, ఎన్నిక వాయిదా వేయించారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చొరవ తీసుకొని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగేందుకు సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని, రానున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ గాండ్లపెంట మండల కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రామాంజులురెడ్డి, గజ్జల రవీంద్రారెడ్డి, ఫక్రుద్దీన్, కొండప్ప, నరసింహులు, డా.వేమయ్య, పూల రామక్రిష్ణ, బహవుద్దీన్, మైనుద్దీన్, మదార్, పవన్‌కుమార్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబులో ఓటమి భయం
Published Sun, Apr 16 2017 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM
Advertisement