sidhareddy
-
పల్లె పరిమళాల సౌందర్యం ‘రాళ్లకుచ్చె’
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛమైన తెలంగాణ పల్లె పరిమళాలు దాసరి మోహన్ రాసిన కథా సంపుటి ‘రాళ్లకుచ్చె’లో పుష్కలంగా ఉన్నాయని తెలంగాణ సాహిత్య ఆకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. 32వ జాతీయ పుస్తక ప్రదర్శన వేదికగా ఆదివారం పలువురు తెలంగాణ కవులు రాళ్లకుచ్చె కథా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని దాసరి మోహన్ ఈ కథా సంపుటిలో అద్భుతంగా పొందుపర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. రాళ్లకుచ్చె కథా సంపుటిని రచయిత దాసరి మోహన్.. తెలంగాణ రచయితల సంఘానికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో తంగేడు పత్రిక ఎడిటర్ కాంచనపల్లి గోవర్ధన్, జంటనగరాల తెలంగాణ రచయితల సంఘం తరఫున కందుకూరి శ్రీరాములు, ప్రముఖ కవి కూర చిదంబరం తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురం నుంచి స్వస్థలాలకు రాజస్థానీయులు
సాక్షి, అనంతరపురం : అనంతపురం జిల్లా కదిరి షెల్టర్ హోమ్‌లో ఉన్న 36మంది రాజస్థానీయులను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 18న బెంగళూరు నుండి కదిరి మీదుగా వెళ్తున్న 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని షెల్టర్‌హోమ్‌కు తరలించారు. అక్కడే వారికి అన్ని వసతులు కల్పించి భోజన ఏర్పాట్లు కూడా చేశారు. లాక్డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించడంతో వారందరినీ స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్వయంగా దగ్గరుండి వారిని విజయవాడ తరలించారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే బస్సులో వారు రాజస్థాన్ వెళ్లనున్నారు. 14 రోజుల పాటు అన్ని వసతులు కల్పించిన అధికారులకు, ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి రాజస్థానీయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా సిధారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం - తెలంగాణ కోసం ‘అక్షర పోరు’ సాగించిన రచయిత - ప్రాణహిత, భూమిస్వప్నం, దివిటీ, నాగేటి సాల్లల్లో.. వంటివెన్నో రచనలు సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా సుపరిచుతులైన సిధారెడ్డి ఎన్నో పుస్తకాల ను వెలువరించారు. కేసీఆర్‌కు బాల్య మిత్రు డు కూడా. సిద్దిపేట సమీపంలోని బందారం గ్రామానికి చెందిన సిధారెడ్డి 2012లో తెలుగు అధ్యాపకులుగా పదవీ విరమణ పొందారు. తర్వాత నిరంతరం సాహిత్య సేద్యంలో తలమునకలై ఇప్పటికీ పుస్తక రచనలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వా త సాహిత్య అకాడమీ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో తెలుగు వర్సిటీని స్థాపించారు. స్వతహాగా సాహిత్య అభిలాషి అయిన కేసీఆర్.. వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యమైన తెలంగాణ సాహిత్య అకాడమీని ప్రారంభించి, దానికి సిధారెడ్డిని చైర్మన్‌గా నిర్ణయించారు. మిగతా రెండు అకాడమీలు కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయి. విద్యార్థి దశ నుంచే సాహితీ సేద్యం.. 1955లో జన్మించిన సిధారెడ్డి తన విద్యాభ్యాసాన్ని బందారం, వెల్కటూరు, సిద్దిపేటలో కొనసాగించారు. ఆయన తండ్రి బాల సిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో ఎంఏ చదివిన సిధారెడ్డి.. ఆధునిక తెలుగు కవిత్వం లో సూర్యుడు అనే అంశంపై 1981లో ఎంఫిల్ చేశారు. ఆధునిక కవిత్వం, వాస్తవికత, అధివా స్తవికతపై పరిశోధన చేసి 1986లో పీహెచ్డీ çఅందుకున్నారు. ఉమ్మడి మెదక్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి 2012లో పదవీ విరమణ పొందారు. విద్యార్థి దశ నుంచే కథలు, కవిత్వం రాయడం అలవాటున్న సిధారెడ్డి.. ప్రాణహిత, భూమిస్వప్నం, దివిటీ, నాగే టి సాల్లల్ల, ఇక్కడి చెట్లగాలి, ఒక బాధ కాదు తదితర రచనలు అందించారు. నవ సాహితి, మెదక్ స్టడీ సర్కిల్ సంస్థలను నిర్వహించారు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు మంజీరా బులెటిన్‌కు సంపాదకత్వం వహించి 7 కవితా సంకలనాలను వెలువరించారు. సోయి అనే పత్రికకూ సంపాదకత్వం వహించారు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిం చారు. 1997 ఆగస్టులో గంట వ్యవధిలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆవశ్యకతపై సిధారెడ్డి రచించిన ‘నాగేటి సాల్లల్ల..’కవిత ప్రసిద్ధి చెందింది. ఇదే కవిత ఆధారంగా ‘పోరు తెలంగాణ’ సినిమాలో పాటగా చిత్రీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం నందిని సిధారెడ్డికి నంది అవార్డును ప్రకటిం చింది. తనను రాష్ట్ర సాహిత్య అకాడమీకి చైర్మన్‌గా నియమించిన కేసీఆర్, చొరవచూపిన హరీశ్‌రావుకు సిధారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాహిత్య రుణం తీర్చుకుంటా: సిధారెడ్డి ‘‘సీఎం కేసీఆర్ తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా సాహిత్య సేవ చేసే అవకాశాన్ని నాకు అందించారు. ఈ పదవి కంటే అకాడమీ ఏర్పాటు ఆకాంక్ష నెరవేరినందుకు సంతో షంగా ఉంది’’అని నందిని సిధారెడ్డి అన్నారు. మంగళవారం ‘సాక్షి’ ఆయనతో ముచ్చటించింది. ‘‘తెలంగాణ వచ్చినా సాహిత్య అకాడమీ లేదన్న బాధ ఇన్ని రోజుల పాటు ఉండేది. అకాడమీని ఏర్పాటు చేస్తే న్యాయం జరిగేదన్న నా అకాంక్షను సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. బాధ్యత అప్పగించారు. సీఎం ఇచ్చిన ఈ అవకాశంతో తెలంగాణ సాహిత్య రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా’’అని సిధారెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబులో ఓటమి భయం
కదిరి : ‘ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదే«శం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తుగా ఓడిపోయింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎలాగైనా ఆ ఎన్నిక జరగకూడదని తన పార్టీ నాయకులతో పాటు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారు’ అని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త పివి సిద్దారెడ్డి ఆరోపించారు. గాండ్లపెంట మండలం కతమతంపల్లిలో ఓ వివాహ వేడుకకు ఆదివారం హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 27మంది కౌన్సిలర్ల మద్దతు ఉందన్నారు. అలాంటి చోట టీడీపీ ఎలా గెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అధికార దర్పంతో అప్రజాస్వామికంగా గెలివాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందన్న విషయం ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. చంద్రబాబు అధికార యంత్రాంగం తొత్తులుగా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. ఎప్పటికీ నాయకులు శాశతం కాదన్న విషఁం అధికారులు గ్రహించాలన్నారు. ప్రొద్దుటూరులో ఇప్పటికే రెండు సార్లు టీడీపీ నాయకులు గొడవకు దిగి, ఎన్నిక వాయిదా వేయించారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చొరవ తీసుకొని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగేందుకు సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని, రానున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ గాండ్లపెంట మండల కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రామాంజులురెడ్డి, గజ్జల రవీంద్రారెడ్డి, ఫక్రుద్దీన్, కొండప్ప, నరసింహులు, డా.వేమయ్య, పూల రామక్రిష్ణ, బహవుద్దీన్, మైనుద్దీన్, మదార్, పవన్‌కుమార్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యాయమే గెలిచింది
కదిరి : తలుపుల మండల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఈసీ సభ్యులు పూలశ్రీనివాసరెడ్డితో పాటు మరో 30 మందిపై పోలీసులు పెట్టిన తప్పుడు కేసును శుక్రవారం కదిరి కోర్టు కొట్టివేసింది. దాడి నిజం కాదంటూ నమ్ముతూ ఏజేఎఫ్సీఎం ఆదినారాయణ కేసు కొట్టి వేస్తున్నట్లు ప్రకటించారు. 2014 ఏప్రిల్ 9న సాధారణ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు తలుపుల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి, స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారంటూ ఆ మండల పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 143, 188, 353, 427, 506తో పాటు పీపీ యాక్టు కింద అప్పట్లో కేసు (క్రైం నెం 51/2014) నమోదు చేశారు. డిఫెన్స్ వారి తరపున న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి తన వాదనలు బలంగా విన్పించారు. స్టేషన్‌పై దాడి పూర్తిగా అవాస్తవమని ఆయన కోర్టు ముందు వాదించారు. ప్రాసిక్యూషన్ తరపున ప్రభుత్వ న్యాయవాది ఖాదర్‌బాషా తన వాదనలు విన్పించారు. చివరకు దాడికి గల బలమైన ఆధారాలు లేవంటూ కోర్టు నమ్ముతూ ఈ కేసును కొట్టివేసింది. అనంతరం పూల శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని తాము నమ్మినామని, చివరకు న్యాయమే గెలిచిందన్నారు. ఇప్పటికైనా పోలీసులు తప్పుడు కేసులు బనాయించడం మానుకోవాలని వారు హితవు పలికారు.