తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా సిధారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
- తెలంగాణ కోసం ‘అక్షర పోరు’ సాగించిన రచయిత
- ప్రాణహిత, భూమిస్వప్నం, దివిటీ, నాగేటి సాల్లల్లో.. వంటివెన్నో రచనలు
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా సుపరిచుతులైన సిధారెడ్డి ఎన్నో పుస్తకాల ను వెలువరించారు. కేసీఆర్‌కు బాల్య మిత్రు డు కూడా. సిద్దిపేట సమీపంలోని బందారం గ్రామానికి చెందిన సిధారెడ్డి 2012లో తెలుగు అధ్యాపకులుగా పదవీ విరమణ పొందారు. తర్వాత నిరంతరం సాహిత్య సేద్యంలో తలమునకలై ఇప్పటికీ పుస్తక రచనలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
రాష్ట్రం ఏర్పాటైన తర్వా త సాహిత్య అకాడమీ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో తెలుగు వర్సిటీని స్థాపించారు. స్వతహాగా సాహిత్య అభిలాషి అయిన కేసీఆర్.. వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యమైన తెలంగాణ సాహిత్య అకాడమీని ప్రారంభించి, దానికి సిధారెడ్డిని చైర్మన్‌గా నిర్ణయించారు. మిగతా రెండు అకాడమీలు కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయి.
విద్యార్థి దశ నుంచే సాహితీ సేద్యం..
1955లో జన్మించిన సిధారెడ్డి తన విద్యాభ్యాసాన్ని బందారం, వెల్కటూరు, సిద్దిపేటలో కొనసాగించారు. ఆయన తండ్రి బాల సిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో ఎంఏ చదివిన సిధారెడ్డి.. ఆధునిక తెలుగు కవిత్వం లో సూర్యుడు అనే అంశంపై 1981లో ఎంఫిల్ చేశారు. ఆధునిక కవిత్వం, వాస్తవికత, అధివా స్తవికతపై పరిశోధన చేసి 1986లో పీహెచ్‌డీ çఅందుకున్నారు. ఉమ్మడి మెదక్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి 2012లో పదవీ విరమణ పొందారు. విద్యార్థి దశ నుంచే కథలు, కవిత్వం రాయడం అలవాటున్న సిధారెడ్డి.. ప్రాణహిత, భూమిస్వప్నం, దివిటీ, నాగే టి సాల్లల్ల, ఇక్కడి చెట్లగాలి, ఒక బాధ కాదు తదితర రచనలు అందించారు.
నవ సాహితి, మెదక్ స్టడీ సర్కిల్ సంస్థలను నిర్వహించారు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు మంజీరా బులెటిన్‌కు సంపాదకత్వం వహించి 7 కవితా సంకలనాలను వెలువరించారు. సోయి అనే పత్రికకూ సంపాదకత్వం వహించారు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిం చారు. 1997 ఆగస్టులో గంట వ్యవధిలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆవశ్యకతపై సిధారెడ్డి రచించిన ‘నాగేటి సాల్లల్ల..’కవిత ప్రసిద్ధి చెందింది. ఇదే కవిత ఆధారంగా ‘పోరు తెలంగాణ’ సినిమాలో పాటగా చిత్రీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం నందిని సిధారెడ్డికి నంది అవార్డును ప్రకటిం చింది. తనను రాష్ట్ర సాహిత్య అకాడమీకి చైర్మన్‌గా నియమించిన కేసీఆర్, చొరవచూపిన హరీశ్‌రావుకు సిధారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సాహిత్య రుణం తీర్చుకుంటా: సిధారెడ్డి
‘‘సీఎం కేసీఆర్ తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా సాహిత్య సేవ చేసే అవకాశాన్ని నాకు అందించారు. ఈ పదవి కంటే అకాడమీ ఏర్పాటు ఆకాంక్ష నెరవేరినందుకు సంతో షంగా ఉంది’’అని నందిని సిధారెడ్డి అన్నారు. మంగళవారం ‘సాక్షి’ ఆయనతో ముచ్చటించింది. ‘‘తెలంగాణ వచ్చినా సాహిత్య అకాడమీ లేదన్న బాధ ఇన్ని రోజుల పాటు ఉండేది. అకాడమీని ఏర్పాటు చేస్తే న్యాయం జరిగేదన్న నా అకాంక్షను సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. బాధ్యత అప్పగించారు. సీఎం ఇచ్చిన ఈ అవకాశంతో తెలంగాణ సాహిత్య రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా’’అని సిధారెడ్డి పేర్కొన్నారు.