ఆదివారం పుస్తక ప్రదర్శనలో కథా సంపుటిని ఆవిష్కరిస్తున్న రచయితలు
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛమైన తెలంగాణ పల్లె పరిమళాలు దాసరి మోహన్ రాసిన కథా సంపుటి ‘రాళ్లకుచ్చె’లో పుష్కలంగా ఉన్నాయని తెలంగాణ సాహిత్య ఆకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. 32వ జాతీయ పుస్తక ప్రదర్శన వేదికగా ఆదివారం పలువురు తెలంగాణ కవులు రాళ్లకుచ్చె కథా సంపుటిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని దాసరి మోహన్ ఈ కథా సంపుటిలో అద్భుతంగా పొందుపర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. రాళ్లకుచ్చె కథా సంపుటిని రచయిత దాసరి మోహన్.. తెలంగాణ రచయితల సంఘానికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో తంగేడు పత్రిక ఎడిటర్ కాంచనపల్లి గోవర్ధన్, జంటనగరాల తెలంగాణ రచయితల సంఘం తరఫున కందుకూరి శ్రీరాములు, ప్రముఖ కవి కూర చిదంబరం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment