సినీ నటి ప్రణీత సందడి | Heroine praneetha presence at shopping mall opening in adilabad | Sakshi
Sakshi News home page

సినీ నటి ప్రణీత సందడి

Published Sat, Feb 24 2018 4:47 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

Heroine praneetha presence at shopping mall opening in adilabad - Sakshi

ప్రణీతతో సెల్ఫీ దిగుతున్న మహిళా పోలీసు 

ఆదిలాబాద్‌కల్చరల్‌ : జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో ప్రముఖ సినీనటి ప్రణీత సందడి చేసింది. సంప్రదాయబద్ధమైన చీరకట్టుతో అభిమానులను మంత్రముగ్దులను చేసింది. శుక్రవారం ఏసీఎన్‌ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమెను చూసేందుకు ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. భవనాలు ఎక్కి, రోడ్డుపై నిలబడి వీక్షించారు. కేరింతలు కొడుతూ ప్రణీతను ఉత్సాహపరిచారు. సరికొత్త చీరలను చూస్తూ.. షాపింగ్‌మాల్‌లోని వçస్త్రాలను చూపిస్తూ హడావుడి చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్‌ వంటి ప్రాంతాల్లో అత్యాధునిక వస్త్రాలను అన్ని రకాలుగా అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. పెళ్లిలు, వేడుకలకు హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే లభిస్తాయని తెలిపారు. ఏసీఎన్‌ షాపింగ్‌మాల్‌ను ఆదరించాలని కోరారు. ప్రస్తుతం కన్నడ సినిమాలలో అవకాశాలు ఉన్నాయని, అత్తారింటికి దారేది సినిమా తర్వాత  సినిమాలకు అంతగా ఆదరణ ఇవ్వలేదని పేర్కొన్నారు. మంచి కథ ఏదైనా తెలుగులో ఉంటే నటించేందుకు సిద్ధమేనని చెప్పారు. ఏసీఎన్‌ యాజమానులు చంద్రబాను, ప్రవీణ్, బీసీ వెల్పేర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకిషన్‌ గురిజాల, డీసీసీబీ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, భుక్తాపూర్‌ కౌన్సిలర్‌ వెనగంటి ప్రకాష్, మావల సర్పంచ్‌ రఘుపతి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement