abhinandan
-
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్‌లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌లో ఈ ఘటన జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్‌కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
'అభినందన'లు
యశవంతపుర: శతృదేశంపై అపార ధైర్యసాహసాలతో వైమానిక దాడి జరిపిన వాయుసేన పైలట్ అభినందన్‌కు గు ర్తుగా తమ బిడ్డలకు ఆయన పేరే పెట్టుకుని మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. బాగలకోట జిల్లా ముధోళ్ పట్టణంలో జనతా ప్లాట్‌కు చెందిన రైతు సిద్ధ అంబిగేర, కమల దంపతులకు సోమవారం మగబిడ్డ జన్మించాడు. చిన్నారికి అభినందన్ అని నామకరణం చేశారు. ఈమె అభినందన : బాగలకోట జిల్లా ఇళకల్‌కు చెందిన అరవింద్ జమఖండి కూతురికి అభినందనగా నామకరణం చేశారు. వింగ్ కమాండర్ గౌరవార్థం ఈ పేరు పెట్టుకున్నట్లు తెలిపారు. -
వాఘా వద్ద భద్రత కట్టుదిట్టం
-
భారత్ పాకిస్ధాన్ మధ్య యుద్ధ మేఘాలు
-
పాక్ విడుదల చేసిన వీడియో..!
-
అభినందన్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు అభినందన్ సత్తా చాటాడు. కేరళలోని త్రివేండ్రం లో జరుగుతోన్న ఈ పోటీల్లో ఎలైట్ మెన్ 15కి.మీ స్క్రాచ్ రేసులో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం అభినందన్ దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా పనిచేస్తున్నాడు.