సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం వీరభద్ర సింగ్‌ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్ మండీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టారు.
‘మీరు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఏడోసారి కూడా సీఎం అవుతారని నేను గట్టిగా చెబుతున్నా. మొత్తం కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంది’ అని ర్యాలీలో వీరభద్ర సింగ్‌నుద్దేశించి రాహుల్ అన్నారు. అయితే రాహుల్ నిర్ణయం హిమాచల్ కాంగ్రెస్‌లో చీలికకు కారణమవుతుందా?, అధిష్టానం నిర్ణయాన్ని సింగ్ వ్యతిరేకులు ఆమోదిస్తారా? లేదా? అన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే. వీరభద్రసింగ్‌పై పీసీసీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుక్కు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే, అధిష్టానం బుజ్జగింపులతో సింగ్ దిగొచ్చినట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment