Veerabhadra Singh
-
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
సిమ్లా: దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు.. ఆరు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని.. కాకపోతే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని 86 ఏళ్ల వీరభద్ర సింగ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్ పని చేశారు. 2017లో అధికారం నుంచి దిగిపోయిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం అర్కీలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇకపై ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పని చేస్తా’’ అని వీరభద్ర సింగ్ తన నియోజకవర్గానికి చెందిన వారితో చెప్పారు. వీరభద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వారిలో ఆయన ఒకరు. ఆయనపై బీజేపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం వాటి విచారణ కొనసాగుతోంది. అయితే వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడుగా వీరభద్ర సింగ్ ఉన్నారు. 2012 నుంచి 2017 వరకు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా వ్యహరించారు. 1983 నుంచి 1990, 1993 నుంచి 98, 2003-07కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1962, 67, 71, 80, 2007లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ రాష్ట్రానికి తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
హిమాచల్ ప్రదేశ్‌లో మొదలైన పోలింగ్
సాక్షి, సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తిరిగి విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా ఓటేసిన అనంతరం ఆయన ట్విటర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. హిమాచల్ ప్రజలు తమ పాలనపై సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిందని ఆయన అన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ కూడా పోలింగ్ మొదలైన తొలి గంటలోనే తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇదిలా ఉండగా హిమాచల్ ఎన్నికల్లో ఈ దఫా తిరిగి అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రజలు అభివృద్ధి పట్టం కడతారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు.. ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఈ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, ఎలాగైనా పవర్లోకి రావాలనీ బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇరు పార్టీలు మొత్తం 68 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాయి. హిమాచల్ ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు. కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 68 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాయి. మొత్తం 337 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 62 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోదఫా తమ భవిష్యత్‌ను పరీక్షించుకుంటున్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ 42 స్థానాల్లో పోటీ చేస్తోంది. సీపీఎం 14, సీపీఐ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్నికల సంఘం 7,525 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 50.25 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం అభ్యర్థుల్లో అందరి చూపు ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, బీజేపీ నేత పీకే ధుమాల్ మీదే ఉంది. ఎన్నికలు ముగిసిన 40 రోజుల తరువాత అంటే డిసెంబర్ 18న ఫలితాలు వెలువడతాయి. సీఎం వీరభద్ర సింగ్ అవినీతిపై బీజేపీ తీవ్ర ప్రచారం చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దనోట్ల రద్దు, జీఎస్టీపై ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు సభల్లో పాల్గొనగా, ప్రధాని నరేంద్ర మోదీ రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయిల్స్‌ను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఎన్నికల భధ్రత కోసం 17,850 మంది రాష్ట్ర పోలీసులను, 65 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 36 సీట్లు సాధించగా బీజేపీ 26 స్థానాల్లో గెలుపొందింది. Confident of getting majority in the election, the next Government too will be of Congress: Virbhadra Singh #HimachalPradesh pic.twitter.com/eQhwLq50ld — ANI (@ANI) 9 November 2017 Hamirpur: BJP's chief ministerial candidate Prem Kumar Dhumal and BJP MP from Hamirpur Anurag Thakur cast their votes. #HimachalPradeshElections pic.twitter.com/pNxe6IzYu0 — ANI (@ANI) 9 November 2017 मैं समस्त हिमाचलवासियों से अपील करता हूँ कि देवभूमि हिमाचल के मान और प्रतिष्ठा को पुनः स्थापित कर प्रदेश का चहुंमुखी विकास करने वाली सरकार बनाने के लिए मतदान अवश्य करें। pic.twitter.com/bJURArTfkF — Amit Shah (@AmitShah) 9 November 2017 -
హిమాచల్‌లో ఏం జరుగుతోంది?
సాక్షి, సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వరాదనుకుంటోంది. అందుకే ఎనిమిది రోజుల్లో పోలింగ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి పీకే ధుమాల్ పేరును ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటిస్తారా, లేదా? అంటూ ధుమాల్ హెచ్చరిక జారీ చేయడంతో పార్టీలో పలుకుబడి కలిగిన ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేసినట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించాల్సి వచ్చింది. ఇక్కడ ఏ మాత్రం తాత్సారం చేసిన ధుమాల్ అలిగే ప్రమాదం ఉందని, ఆయన అలిగితే పార్టీ అసంతృప్తి రగిలే ప్రమాదం ఉందని పార్టీ అధిష్టానం గ్రహించింది. వాస్తవానికి ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం ప్రస్తుత బీజేపీ సంప్రదాయం కాదు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల విశ్వాసంతోనే ప్రజలు తమ పార్టీని గెలిపించాలన్నది వారి అభిమతం. హిమాచల్‌లోని వీరభద్ర సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించడం ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచింది. పైగా ఓ పర్యాయం అధికారంలోకి వచ్చిన పార్టీ మరో పర్యాయం అధికారంలోకి రాదు. ఇలా రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల సర్వేలు కూడా బీజేపీ విజయాన్నే సూచించాయి. ఇన్ని విధాలుగా విజయావకాశాలున్నప్పటికీ పార్టీ సీఎం అభ్యర్థిని బీజేపీ ముందుగా ప్రకటించాల్సి వచ్చింది. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లను మంచి చేసుకోవడంలో బీజేపీ సమతౌల్యత పాటించినప్పటికీ ఠాకూర్లు మాత్రం ఇప్పటికీ బీజేపీకి దూరంగా ఉన్నారు. వారిని మంచి చేసుకోవడంలో భాగంగానే అదే సామాజిక వర్గానికి చెందిన పీకే ధుమాల్‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కూడా ఠాకూర్ సామాజిక వర్గానికే చెందిన వారు. -
హిమాచల్ సీఎం అభ్యర్థి వీరభద్ర సింగ్: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం వీరభద్ర సింగ్‌ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్ మండీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టారు. ‘మీరు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఏడోసారి కూడా సీఎం అవుతారని నేను గట్టిగా చెబుతున్నా. మొత్తం కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంది’ అని ర్యాలీలో వీరభద్ర సింగ్‌నుద్దేశించి రాహుల్ అన్నారు. అయితే రాహుల్ నిర్ణయం హిమాచల్ కాంగ్రెస్‌లో చీలికకు కారణమవుతుందా?, అధిష్టానం నిర్ణయాన్ని సింగ్ వ్యతిరేకులు ఆమోదిస్తారా? లేదా? అన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే. వీరభద్రసింగ్‌పై పీసీసీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుక్కు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే, అధిష్టానం బుజ్జగింపులతో సింగ్ దిగొచ్చినట్లు తెలుస్తుంది. -
వీరభద్రసింగ్ కేసు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కేసును సుప్రీంకోర్టు ఢిల్లీ హై కోర్టుకు బదిలీ చేసింది. ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ హై కోర్టు విచారణ చేపడుతుండగా దీనిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని వీరభద్రసింగ్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ పిటీషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు వీరభద్రసింగ్ అభ్యర్థనకు అనుమతిచ్చింది. -
'బాధిత కుటుంబాలకు 5 లక్షలు చెల్లించండి'
-
'బియాస్ నది బాధిత కుటుంబాలకు 5 లక్షలు చెల్లించండి'
హైదరాబాద్: బియాస్ నది దుర్ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ప్రభుత్వాన్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఆకస్మికంగా నీటి ప్రవాహం పెరగడంతో జూన్ 8వ తేది ఆదివారం విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్ధులు గల్లైంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లైంతనవారిలో 17 మంది విద్యార్ధుల మృతదేహాలు లభ్యమవ్వగా, ఇంకా 7 మృతదేహాలు దొరకాల్సి ఉంది.